ఇకపై డబ్బులు చెల్లిస్తేనే వాట్సప్, ఫ్రీ కాదు !
వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాడుతున్న ఒకే ఒక ఫీచర్ వాట్సప్. ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు వాట్సప్ మీదనే ఉంటారు. అలాంటి వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి.

ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ యూజర్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌కు కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్ యాజమాన్యం దీనిని 2014లో కొనుగోలు చేసింది. అయితే సేవల విషయంపై కొన్ని అనుమానాలు రేకెత్తినా ఇప్పటివరకూ ఉచితంగానే వాట్సప్ సేవలు అందిస్తోంది.

తాజాగా వ్యాపారవేత్తల కోసం ఈ యాప్‌లో బిజినెస్ టూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ టూల్‌ను వినియోగించాలనుకుంటే మాత్రం సొమ్ము చెల్లించక తప్పదు. అయితే ఈ మొబైల్ బిజినెస్ టూల్ ఇంకా టెస్టింగ్ పొజిషన్‌లోఉంది.

ఇదిపూర్తయ్యాక.. చిరు వ్యాపారులకు దీనిని మొదట్లో ఉచితంగా అందించాలన్న ఆలోచన ఉందని వాట్సప్ అధికారులు తెలిపారు. మన దేశంలో ఇప్పటికే ఈ టెస్టింగ్ దశలో ఉన్న ఈ టూల్‌ని బుక్‌మైషో ఉపయోగిస్తోంది.


Click it and Unblock the Notifications








