ఐఫోన్ iOS యూజర్లకు అందుబాటులో వాట్సాప్ కొత్త ఫీచర్లు!! మీరు ఓ లుక్ వేయండి

|

సోషల్ మీడియా నెట్‌వర్క్‌ లలో ఒకటైన వాట్సాప్ త్వరిత మెసేజ్ లను పంపడం కోసం అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. వాట్సాప్ ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు కొత్త కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా వాట్సాప్ తన iOS యాప్ కోసం వెర్షన్ 2.21.71 కొత్త అప్ డేట్ ను విడుదల చేసింది. ఈ కొత్త అప్ డేట్ తో ఐఫోన్ వినియోగదారులు రెండు కొత్త ఫీచర్లను పొందుతున్నారు. ఇవి వాట్సాప్ చాట్స్‌లో అందుకున్న ఫోటోలను తెరవకుండానే చూడటం మరింత సులభం చేస్తుంది. IOS కొత్త అప్ డేట్ లో వాట్సాప్ ఇప్పుడు ఫోటోలు మరియు వీడియోల యొక్క చిన్న చదరపు ప్రీవ్యూకి బదులుగా పెద్ద ప్రివ్యూలను ప్రదర్శిస్తుంది. ఇది కంటెంట్‌ను ఓపెన్ చేయడానికి బదులు త్వరగా చూడటానికి వినియోగదారులకు సహాయపడుతుంది.

WhatsApp Two New Features Now Available For Apple iPhone iOS Users

IOS కొత్త అప్ డేట్ లో వాట్సాప్ యొక్క మరో పెద్ద మార్పు విషయానికి వస్తే వాట్సాప్ కనుమరుగవుతున్న మెసేజ్ లను విస్తరిస్తోంది. ఒక గ్రూపులోని సభ్యులందరూ ఇప్పుడు క్రొత్త అప్ డేట్ తో కనుమరుగవుతున్న మెసేజ్ల సెట్టింగులను మార్చవచ్చు. ఇంతకు ముందు ఈ హక్కు గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే కేటాయించబడింది. అయితే ఇప్పుడు గ్రూపులోని సభ్యులందరికి కూడా కనుమరుగవుతున్న మెసేజ్ ల సెట్టింగులను మార్చగల సామర్థ్యం ఉంటుంది. గ్రూప్ అడ్మిన్ "గ్రూప్ సమాచారాన్ని సవరించగలరు" కాబట్టి కొంచెం ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటారని గుర్తుంచుకోండి.

WhatsApp Two New Features Now Available For Apple iPhone iOS Users

వాట్సాప్ కనుమరుగవుతున్న మెసేజ్లు అనేవి ఏడు రోజుల తర్వాత ఆటొమ్యాటిక్ గా తొలగించే మెసేజ్లను పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఏడు రోజుల వ్యవధిలో వినియోగదారు వాట్సాప్ ఓపెన్ చేయకపోతే కనుక మెసేజ్ పూర్తిగా తొలగించబడుతుంది. అయినప్పటికీ వాట్సాప్ తెరవబడే వరకు మెసేజ్ యొక్క ప్రివ్యూ నోటిఫికేషన్లలో కనిపిస్తుంది. అలాగే మీరు మెసేజ్ కి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ప్రారంభ మెసేజ్ కోట్ చేయబడుతుంది. మీరు కనుమరుగవుతున్న మెసేజ్ కి ప్రత్యుత్తరం ఇస్తే కనుక కోట్ చేసిన వచనం ఏడు రోజుల తర్వాత చాట్‌లో ఉండవచ్చు. ఇప్పుడు వాట్సాప్ ఈ అదృశ్యయ్యే మెసేజ్ల సమయాన్ని ప్రస్తుత 7 రోజుల నుండి 24 గంటలకు తగ్గించడానికి పరీక్షిస్తోంది.

Best Mobiles in India

English summary
WhatsApp Two New Features Now Available For Apple iPhone iOS Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X