వాట్సాప్ నుంచి మేజర్ సెక్యూరిటీ అప్‌డేట్

ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ యూజర్లు తమ ఫోన్‌లలోని యాప్‌ను అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

|

టు- స్టెప్ వెరిఫికేషన్ పేరుతో మేజర్ సెక్యూరిటీ అప్‌డేట్‌ను వాట్సాప్ విడుదల చేసింది. నవంబర్ 2016లోనే ఈ సెక్యూరిటీ ఫీచర్‌ను అనౌన్స్ చేసినప్పటికి అధికారికంగా మాత్రం ఇప్పటి నుంచే లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ యూజర్లు తమ ఫోన్‌లలోని యాప్‌ను అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

వాట్సాప్ నుంచి మేజర్ సెక్యూరిటీ అప్‌డేట్

Read More : మీ ఫోన్ ఆన్ అవకపోతే ఏం చేయాలి..?

ఈ సెక్యూరీటీ అప్‌డేట్‌ను పొందాలనుకునే వారు ముందుగా తమ ఫోన్‌లోని వాట్సాప్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవల్సి ఉంటుంది. అప్‌డేట్‌ అయిన వెంటనే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ విభాగాన్ని అందులోని Two-step verification ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. వాస్తవానికి Two-step verification అనేది ఆప్షనల్ సదుపాయం. తమ వాట్సాప్ అకౌంట్ లకు అదనపు సెక్యూరిటీని కోరుకునే వారు ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

వాట్సాప్ నుంచి మేజర్ సెక్యూరిటీ అప్‌డేట్

Read More : మీ ఫోన్ వాల్‌పేపర్ గంటగంటకి మారిపోవాలా..?

టూ స్టెప్ వెరిఫికేషన్ వెరిఫికేషన్‌లో భాగంగా మొదటి స్టెప్‌లో 6 అంకెల పాస్‌‌కోడ్‌ను సెట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆప్షనల్‌గా మీ ఈ-మెయిల్ ఐడీని కూడా ఇవ్వాలి. ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన నాటి నుంచి, వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసే ప్రతిసారి అదనపు సెక్యూరిటీగా 6 అంకెల పాస్‌‌కోడ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఒక వేళ మీరు పాస్‌కోడ్‌ను మర్చిపోయినట్లయితే, మీ మెయిల్ ఐడీకి ప్రత్యేకమైన లింక్ పంపబడుతుంది. ఆ లింక్ ద్వారా మీ వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్ కావచ్చు. Two-step verification ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు హ్యాక్ చేయలేరు. దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్‌లోని వ్యక్తిగత డేటా మరింత సురక్షితంగా ఉంటుంది.

Read More : ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

Best Mobiles in India

English summary
WhatsApp Two-Step Verification Now Rolling Out Now. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X