వాట్సాప్ లో రాబోయే కొత్త ఫీచర్లు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న వాట్సాప్ మరో 5 ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఈ నేపధ్యంలో త్వరలో రానున్న ఆ 5 ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

Jio GigaFiberకి పోటీగా భారత్ ఫైబర్, BSNL ధమాకా ఆఫర్Jio GigaFiberకి పోటీగా భారత్ ఫైబర్, BSNL ధమాకా ఆఫర్

WhatsApp Fingerprint Lock feature

WhatsApp Fingerprint Lock feature

వాట్సప్‌ యాప్‌ ఓపెన్ చేయడానికి మీరు ప్యాటర్న్ లాక్, పాస్‌కోడ్ సెట్ చేసుకొని ఉంటారు. ఇకపై మీకు ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ని పరీక్షిస్తోంది వాట్సప్. 2.19.3 బీటా వర్షన్‌లో ఇప్పటికే కొందరికి ఫింగర్ ప్రింట్ ఫీచర్ వచ్చేసింది. యాప్‌లో ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో న్యూ సెక్షన్ కనిపించనుంది. మీరు ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేసి వాడుకోవచ్చు.

WhatsApp New Audio Picker

WhatsApp New Audio Picker

భవిష్యత్తులో, వాట్సప్‌ వారి వినియోగదారులు కోసం ఆడియో ఫీచర్ ను రీడిజైన్ చేస్తుంది.ఇందులో మీరు పంపించే ఆడియో ఫైల్స్ ను పంపే ముందే చెక్ చేసుకోవచ్చు. దీనితో పాటు, మీ ఫోన్లో డౌన్లోడ్ చేసిన అన్ని ఆడియో ఫైల్లు కూడా యాప్ లో జాబితా చేయబడతాయి. ఇందులో మీరు 30 ఆడియో ఫైల్స్ ను గరిష్టంగా పంపడానికి అనుమతిస్తుంది.

Stickers Integration

Stickers Integration

Stickers Integration ఫీచర్ వినియోగదారులు వారి వాట్సాప్ చాట్ లో స్టిక్కర్లను షేర్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. మరియు ఈ కొత్త టూల్ ఉపయోగించే మొదటి కీబోర్డ్ GBoard గా ఉంటుంది. దీనితో, వినియోగదారులు ఎంచుకోవడానికి స్టిక్కర్ ఎంపికల సమూహం ఉంటుంది.

3D Touch action for Status

3D Touch action for Status

ఐఫోన్ యూజర్లు త్వరలో ఐఫోన్ యొక్క 3D టచ్ తో స్టేటస్ ను చెక్ చేయగలుగుతారు.ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఫోన్ లో WhatsApp బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

 Reply privately

Reply privately

గ్రూప్‌లో ఏ ఒక మెంబర్‌కైనా మీరు ప్రైవేట్‌గా రిప్లై ఇవ్వాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే రిప్లై ఆ మెంబర్‌కు తప్ప ఇంకెవరికీ కనిపించదు.ఆల్రెడీ ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ iOS లో కూడా రానుంది.

Best Mobiles in India

English summary
WhatsApp upcoming features: Fingerprint lock, Stickers integration, and more with future WhatsApp updates.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X