Just In
- 14 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Movies
హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
వాట్సాప్ ఫీచర్స్: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు త్వరలో మరిన్ని యాక్సిస్ ఫీచర్లు...
భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. మెటా యాజమాన్యంలోని ఈ యాప్ ప్రతిసారీ కొత్త కొత్త ఫీచర్‌లను అందిస్తూ వినియోగదారులను ఈ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించే విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందుబాటులో గల ఒక నివేదిక ప్రకారం వాట్సాప్ గ్రూప్‌లోని గ్రూప్ అడ్మిన్‌లకు కొత్తగా మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకుకొనిరానున్నాయి. ముఖ్యంగా గ్రూపులోని అందరికీ మెసేజ్లను తొలగించడానికి అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. దీనికి సంబందించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గ్రూప్ అడ్మిన్‌లకు అన్ని ఇన్‌కమింగ్ మెసేజ్‌లపై యాక్సిస్
WABetainfo స్క్రీన్‌షాట్ ప్రకారం మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అయితే మీ గ్రూప్‌లోని ఎవరి మెసేజ్‌లను అయినా డిలీట్ చేసే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొనిరానున్నట్లు కొంతకాలం క్రితం పుకారు వచ్చింది. కానీ చివరకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో త్వరలోనే మనం చూడవచ్చు.

మీరు గ్రూప్ అడ్మిన్ గా ఉన్న చాట్‌లోని ఏదైనా ఒక మెసేజ్ ని తొలగించినట్లు గ్రూప్‌లోని ప్రతి ఒక్కరూ చూడగలరు. మీరు అడ్మిన్‌గా ఉన్న గ్రూప్‌లోని మెసేజ్లని తొలగించిన తర్వాత "మీరు ఈ మెసేజ్ ని అడ్మిన్‌గా తొలగించారు" అనే నోట్ ని గ్రూపులోని అందరు కూడా చూడగలరు.

గ్రూప్‌లోని కార్యకలాపాన్ని నియంత్రించడానికి ఈ ఫీచర్ కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత కొన్ని తీవ్రమైన సమస్యల విషయంలో అడ్మిన్‌లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయబడే ప్రతి కంటెంట్‌పై అడ్మిన్‌లకు ఇకపై ఎక్కువ అధికారం కలిగి ఉంటారు.

వాట్సాప్ ఇంకా ఈ ఫీచర్‌ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొనివస్తున్నట్లు ఇంకా నిర్ధారించ లేదు. అయితే మీరు బీటా టెస్టర్ అయితే మీరు ఇప్పటికే ఈ ఫీచర్‌ని కలిగి ఉండవచ్చని WABetainfo వెల్లడించింది. మీరు ఈ ఫీచర్‌ని స్వీకరించారా లేదా అని తనిఖీ చేయడానికి మీరు గ్రూప్ అడ్మిన్‌లుగా ఉన్న ఏదైనా గ్రూపులో ఇన్‌కమింగ్ మెసేజ్లను తొలగించడానికి ప్రయత్నించండి. మీరు ఇన్‌కమింగ్ మెసేజ్లను తొలగించగలిగితే కనుక ఈ కొత్త ఫీచర్ మీకు అందుబాటులోకి వచ్చినట్లే.

వాట్సాప్ గ్రూప్‌లో మీరు ఇన్‌కమింగ్ మెసేజ్‌లను తొలగించలేకపోతే కనుక చింతించకండి. ఎందుకంటే ఈ ఫీచర్ త్వరలో మీకు అందుబాటులోకి రావచ్చు. పరిమిత వినియోగదారులతో వాట్సాప్ ఈ ఫీచర్‌తో ప్రయోగాలు చేస్తోంది కనుక మీరు దీన్ని పొందినట్లయితే, మీరే అదృష్టవంతులుగా భావించండి. ఇది కాకుండా వాట్సాప్ "కెప్ట్ మెసేజ్‌లు" అనే ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. ఈ ఫీచర్ కనుమరుగవుతున్న మెసేజ్ ని స్టాండర్డ్ మెసేజ్ గా మార్చడానికి మరియు ఉంచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

వాట్సాప్ చాట్‌బాట్ కొత్త ఫీచర్
వాట్సాప్ వాచ్‌డాగ్ WABetaInfo ప్రకారం వాట్సాప్ యాప్‌లో అధికారికంగా అందుబాటులోకి తీసుకొనివచ్చే చాట్‌బాట్ యొక్క అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. పబ్లికేషన్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం వాట్సాప్ యాప్‌లో కొత్త వెరిఫైడ్ చాట్‌బాట్ ఉంటుందని చూపిస్తుంది. ఈ చాట్‌బాట్ వారి సంభాషణ జాబితాలో ఉన్న వ్యక్తులలో మొదటి స్థానంలో ఉంటుంది. " ఈ చాట్‌బాట్ కొత్త కొత్త ఫీచర్‌ల గురించి తెలియజేయడం, చిట్కాలు మరియు ట్రిక్‌లను తెలపడం మరియు ప్రైవసీ మరియు భద్రతకు సంబందించిన అన్ని రకాల వివరాలను అందిస్తుంది." వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో బిజినెస్ అకౌంటులను మాత్రమే ధృవీకరిస్తుంది. కానీ వాటిలా కాకుండా మీరు ఈ చాట్‌బాట్‌కు ప్రత్యుత్తరం ఇవ్వలేరు. ఇది చదవడానికి-మాత్రమే అకౌంట్ ఓపెన్ లో ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ వన్-వే కమ్యూనికేషన్ ఉంటుంది. వాట్సాప్ యొక్క తాజా ఫీచర్లు మరియు ఇతర వివరాల గురించి వినియోగదారులకు తెలియజేయడం మరియు ఫీడ్‌బ్యాక్ లేదా ఫిర్యాదులను కోరకపోవడం చాట్‌బాట్ యొక్క ఉద్దేశ్యం. మీరు వాట్సాప్ ని సంప్రదించాలనుకుంటే కనుక కంపెనీ 2019లో ప్రారంభించిన టిప్‌లైన్‌తో సహా ఇతర మార్గాలు ఉన్నాయి.

వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ కోడ్ ఫీచర్
WABetaInfo యొక్క నివేదిక ప్రకారం మీరు మీ యొక్క పాత స్మార్ట్‌ఫోన్ నుండి కొత్త ఫోన్ లో మీ వాట్సాప్ అకౌంటుతో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "డబుల్ వెరిఫికేషన్ కోడ్" ఫీచర్ ధృవీకరణ కోడ్ యొక్క మరొక దశను చూపుతుంది. ఈ నివేదిక ప్రకారం వాట్సాప్ అకౌంటులోకి లాగిన్ చేయడానికి మొదటి ప్రయత్నం విజయవంతమయినప్పటికీ కూడా మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరో ఆరు అంకెల కోడ్ అవసరం. ఎవరైనా వాట్సాప్ లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఫోన్ నంబర్ కి మరొక అదనపు మెసేజ్ పంపబడుతుంది. "ఇప్పటికే మరో ఫోన్‌లో వాట్సాప్ కోసం మీ యొక్క ఈ +********** నంబర్ ఉపయోగించబడుతోంది. మీ అకౌంట్ మీ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవడంలో సహాయం చేయడానికి మీరు తప్పనిసరిగా మరొక ధృవీకరణ కోడ్‌ను నిర్ధారించాలి. అదనపు భద్రత కోసం మీరు కోడ్‌ను పంపడానికి ముందు టైమర్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. మీరు కోడ్‌ని స్వీకరించిన తరువాత దానిని ఇక్కడ నమోదు చేయండి." అనే మెసేజ్ తో కూడిన స్క్రీన్‌షాట్ ని WABetaInfo తన యొక్క లీక్ లో పోస్ట్ చేసింది.

జూన్ 2022లో వాట్సాప్ పే పనితీరు
వాట్సాప్ పే UPI ప్లాట్‌ఫారమ్‌లో 2022 సంవత్సరం మే నెలలో మొత్తంగా 34.8 లక్షల లావాదేవీలు నమోదు అయ్యాయి. అయితే ఈ మొత్తం లావాదేవీలలో జరిగిన ట్రాన్సషన్ మొత్తం రూ. 294.98 కోట్లు. కానీ జూన్ 2022లో ఇది మొత్తం 2.30 కోట్ల లావాదేవీలకు మరియు లావాదేవీల మొత్తంలో రూ.429.06 కోట్ల ట్రాన్సషన్ కు పెరిగింది. వాట్సాప్ పేమెంట్ యొక్క పెరుగుదల చూసుకుంటే కనుక భారీగా పెరిగింది. భారతదేశంలో వందల మిలియన్ల మంది కస్టమర్‌లు ఇటీవల ఈ ప్లాట్‌ఫారమ్‌ను కొత్తగా ఎంచుకున్నారు. ఇందులో లభించే క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధిక మంది ఇందులో చేరారు. క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు ఫోన్‌పే మరియు గూగుల్ పే లలో ఉన్నప్పటికీ వాట్సాప్ అందించే మెరుగైన ప్రయోజనాలను కలిగి లేవు. గూగుల్ పే జూన్ 2022లో 200 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను చూసింది. మొత్తంగా ఈ నెలలో రూ.3,55,137.20 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే నెలలో ఫోన్‌పేలో 273.2 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే మొత్తం లావాదేవీలు రూ. 5,01,474.48 కోట్లు జరగడం గమనార్హం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470