వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ లో లిమిట్స్ ఉన్నాయి తెలుసా ?

|

ఇటీవలి కాలంలో భారతదేశంలో యుపిఐ ఆధారిత చెల్లింపుల ఫీచర్ను WhatsApp ప్రవేశ పెట్టింది. దీని ద్వారా వాట్సాప్ అప్లికేషన్ లోని పేమెంట్ వేదికపై అనేక బ్యాంక్ అకౌంట్లను అనుసంధానం చేయడం ద్వారా , చాట్ బాక్స్ లోనే పేమెంట్ చేయగల ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. UPI ID ద్వారా అమౌంట్ పంపించడం ద్వారా, అవతలి వ్యక్తులకు నోటిఫికేషన్ లో చూపబడడం జరుగుతుంది. కానీ ఇంకనూ వాట్సాప్ , పేమెంట్ ఫీచర్ ను పరీక్షిస్తూనే ఉంది.

WhatsApp likely lets you do 20 UPI payments per day

ఈ సమయంలో, ఒక టెలికాం టాక్ తన నివేదిక లో ఒక క్రొత్త ఫీచర్ కనుగొన్నట్లు పేర్కొంది. దాని ప్రకారం, WhatsApp Pay మీకు రోజుకు 20 UPI చెల్లింపులు వరకు అనుమతిని ఇస్తుంది. అంటే, మీరు ఒకేరోజు ఇరవై VPA (వర్చువల్ చెల్లింపు చిరునామా) లకు లేదా ఒక రోజులో వేర్వేరు VPA లకు 20 చెల్లింపులను మాత్రమే జరుపగలరు. అలాగే, ఒక రోజులో బదిలీ చేయగల గరిష్ట మొత్తం 1,00,000 రూపాయలుగా పేర్కొంది. మరియు ఈ పరిమితి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది.

WhatsApp దేశంలో 200 మిలియన్ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉన్నందున, ఈ సేవ అందరు వినియోగదారులకు అందుబాటులోకి వస్తే, దేశంలోనే అత్యధిక క్రియాశీల UPI సర్వీసుగా వాట్సాప్ కాగలదు. వాట్సాప్ కు పోటీగా పేటి‌ఎం అప్లికేషన్ కూడా UPI పేమెంట్స్ ని ప్రవేశపెట్టగా, గూగుల్ తేజ్ తన వినియోగదారులకోసం పేమెంట్ వద్దనే చాట్ ఫీచర్ను కూడా పొందుపరచింది. అనగా అప్లికేషన్ విడువకుండానే పేమెంట్ జోన్ లోనే చాటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ముందు చెప్పినట్లుగా, WhatsApp ఇటీవలే UPI ID కి డబ్బులు పంపే ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో, ముందులా కాకుండా చాట్ విండోను సైతం తెరవకుండా, నేరుగా UPI ఐడికి డబ్బును పంపవచ్చు. గతంలో, WhatsApp ఫ్లాట్ఫార్మ్ ఉపయోగించి చెల్లింపు సేవలో నమోదు చేసుకున్న నిర్దిష్ట పరిచయాలకు మాత్రమే డబ్బును పంపించే వెసులు బాటు ఉండేది.

కానీ ఈ కొత్త అప్డేట్ లో భాగంగా వచ్చిన ఈ ఫీచర్ లో , సెటింగ్స్ లో పేమెంట్స్ అనే విభాగంలో సెండ్ పేమెంట్ క్లిక్ చేయడం ద్వారా UPI ID ని జతపరచి , అక్కడి నుండే పేమెంట్ చేయగలిగే వెసులుబాటు కలిగింది. దీనికారణంగా , వాట్సాప్ లేని వినియోగదారులు సైతం UPI ఐడిచ లను కలిగి ఉన్న ఎడల వారికి పేమెంట్ చేయగలిగే అవకాశం వచ్చినట్లైంది. ఇది ఒకరకంగా పేమెంట్స్ విధానంలో కొత్త అనుభూతిని ఇవ్వగలదని వాట్సాప్ ఆకాంక్షిస్తుంది.

T159 పేరుతో Apple సీక్రెట్ ప్రాజెక్ట్, శాంసంగ్, LGలే ప్రధాన టార్గెట్ !T159 పేరుతో Apple సీక్రెట్ ప్రాజెక్ట్, శాంసంగ్, LGలే ప్రధాన టార్గెట్ !

ఈ కొత్త పేమెంట్ విధానాలతో పాటు మరికొన్ని ఫీచర్లను కూడా వాట్సాప్ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా WhatsApp గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ ను కల్పించింది, ఈ గ్రూప్ డిస్క్రిప్షన్ లో 500 అక్షరాల సమూహంతో వివరణని జోడించవచ్చు. ఈ సమూహం యొక్క సమాచారం ప్రజలకు కనిపిస్తుంది కాబట్టి సమూహానికి చేరాలని ఆహ్వానించిన లింక్(invitation link )తో ఎవరైనా గ్రూప్ లో చేరాలా లేదా అని వివరణ చదవడంద్వారా నిర్ణయించుకోవచ్చు.

మరియు మరొక ఫీచర్ గా వాట్సాప్ కాల్స్ విభాగంలో ఒక స్విచ్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది, దీని ద్వారా వినియోగదారులు వాయిస్ మరియు వీడియో కాల్స్ మధ్య మారుటకు అనుమతినిస్తుంది. ఈ ఫీచర్ ప్రారంభంలో whatsapp బీటా వర్షన్లో కనిపించింది మరియు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

ఇలా వాట్సాప్ రోజుకో ఫీచర్ని ప్రవేశపెడుతూ వినియోగదారులకు మరింత చేరువయింది.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Payments feature based on UPI available for Android users is believed to have a limit of 20 UPI payments in a day. Also, it is believed that the users can send a maximum amount of Rs. 1,00,000 per day. Recently, the app introduced Send to UPI ID feature, which lets users send money directly to a standalone UPI ID.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X