Home
Apps

WhatsApp Payments మొదటి లుక్ ఇదే

వాట్సాప్ పేమెంట్స్ సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఎక్కువుగా వాట్సాప్‌నే వినియోగించుకుంటారు.

By Sivanjaneyulu Bommu

WhatsApp త్వరలో అందుబాటులో తీసుకురాబోతోన్న Payments ఫీచర్‌‌కు సంబంధించి మొదటి లుక్ రివీల్ అయ్యింది. WABetaInfo, తన బ్లాగ్‌లో పోస్ట్ చేసిన కథనం ప్రకారం వాట్సాప్ ఈ వారం విడుదల చేసిన ఆండ్రాయిడ్ 2.17.285 బేటా వర్షన్‌లో ఈ పేమెంట్స్ ఫీచర్ రహస్యంగా పొందుపరచబడి ఉంది. దీనికి సంబంధించిన ఇమేజ్‌ను మీరు చూడొచ్చు.

Immediate bank to bank transfer

Immediate bank to bank transfer

Immediate bank to bank transfer with UPI పేరుతో ఈ పేజీ కనిపిస్తోంది. దాని క్రింద టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీతో పాటు ACCEPT AND CONTINUE పేరుతో హైలైట్ చేయబడిన ఆప్షన్ ఒకటి కనిపిస్తోంది. ఈ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే పేమెంట్స్ విభాగంలోకి వెళ్లే వీలుంటుంది. ఈ పేజీని బట్టి చూస్తుంటే యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా బ్యాంక్ టు
బ్యాంక్ నగదు ట్రాన్స్‌ఫర్‌కు వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్ ఉపకరిస్తుందని స్పష్టమవుతోంది.

UPI ఆధారిత చెల్లింపులకు భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది

UPI ఆధారిత చెల్లింపులకు భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది

నోట్ల రద్దు తరువాత నగదురహిత లావాదేవీలకు భారత్‌లో ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో IMPS ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే UPI ఆధారిత చెల్లింపు సర్వీసులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది.

ఆ యాప్స్‌లో ఇప్పటికే పేమెంట్స్ సదుపాయం

ఆ యాప్స్‌లో ఇప్పటికే పేమెంట్స్ సదుపాయం

ప్రముఖ మెసేజింగ్ సర్వీసులైన WeChat, Hike Messengerలు ఇప్పటికే పేమెంట్ సర్వీసులను సపోర్ట్ చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్ కూడా ఈ తరహా పేమెంట్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది.

20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు..

20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు..

వాట్పాప్‌కు భారత్‌లో 200 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ పేమెంట్స్ సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఎక్కువుగా వాట్సాప్‌నే వినియోగించుకుంటారు.

Best Mobiles in India

English summary
WhatsApp-UPI Payments Feature Spotted in Beta App. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X