Home
Apps

వాట్సాప్‌ లో ChatGPT.. ఉపయోగాలు ఏంటి.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..?

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ఇటీవల కాలంలో అనేక ఫీచర్‌ లను తీసుకొస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత ఫీచర్లను కూడా జోడిస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి వాట్సాప్‌ యూజర్లు ChatGPT ను యాప్‌ లోనే ఉపయోగించుకోవచ్చు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ ను ChatGPT ను OpenAI సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరింత మందికి ChatGPT సేవలు :
వాట్సాప్‌ తో (Whatsapp) భాగస్వామ్యం ద్వారా ChatGPT మరింత మందికి అందుబాటులోకి వస్తుందని ఓపెన్‌AI భావిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌ యూజర్లు భారీగా ఉన్నారు. ఈ కొత్త నిర్ణయంతో ఈ యూజర్లు అనేక ప్రయోజనాలను పొందుతారు. మరియు సులభంగా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.

whatsapp and chatgpt

ప్రస్తుతానికి వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌ టెక్స్ట్‌ ఇన్‌పుట్స్‌ ను మాత్రమే సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. OpenAi o1 మిని మోడల్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం లేని వినియోగదారులు కూడా సౌకర్యవంతంగా చాట్‌జీపీటీని ఉపయోగించుకోవచ్చు.

ఎలా యాక్టివేట్‌ చేయాలి :
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్‌ యూజర్లు సులభంగా చాట్‌జీపీటీ యాక్సెస్‌ను పొందవచ్చు. 18002428478 నంబర్‌కు సేవ్‌ చేసుకొని, మెసేజ్‌ చేయడం ద్వారా వాట్సాప్‌ యూజర్లు ChatGPT యాక్సెస్‌ను పొందవచ్చు. పెరుగుతున్న ఖర్చుల మధ్య ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు, చాట్‌బాట్‌ ఫీచర్‌ల విస్తరణకు వీలుగా అదనపు ఆదాయాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఈ నిర్ణయానికి ఒక కారణమని తెలుస్తోంది.

whatsapp and chatgpt

దీంతోపాటు అనేక ఫీచర్లు :
దీంతోపాటు వాట్సాప్‌ ఇటీవల అనేక ఫీచర్‌లను తీసుకొచ్చింది. టైపింగ్‌ ఇండికేటర్‌ సహా వాట్సాప్‌ వెబ్‌ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ అప్‌గ్రేట్‌ తోపాటు వాట్సాప్‌ మెసేజ్‌లను నచ్చిన భాషాల్లోకి ట్రాన్సిలేట్‌ చేసే ఫీచర్‌ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను టెస్టింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్‌లో ఇతర భాషల్లో కొన్ని మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని సొంత భాషలోకి ట్రాన్సిలేట్‌ చేసి అర్థం చేసుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి యూజర్లకు ఈ ట్రాన్సిలేట్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ చాట్స్‌తోపాటు ఛానల్‌లో కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌కు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుంది.

దీంతోపాటు వాట్సాప్‌లో రిమైండర్‌ పేరుతో మరో ఫీచర్‌ కూడా రానుంది. చాలా మంది అనేక మందితో చాట్‌ చేస్తుంటారు మరియు వివిధ గ్రూప్స్‌లో ఉంటారు. అందువల్ల కొన్ని చాట్‌లను మర్చిపోయే అవకాశం ఉంది. అలా మర్చిపోయిన చాట్‌లను గుర్తుచేసే విధంగా రిమైండర్‌ ఫీచర్‌ పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందో తెలియలేదు.

దీంతోపాటు ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వాట్సాప్‌ మాతృ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా Caste, ఇన్‌కమ్ సహా ఇతర అనేక సర్టిఫికేట్‌లను నేరుగా వాట్సాప్‌ నుంచే తీసుకొనే అవకాశం ఉందని గతంలో తెలిపింది. ఈ సౌకర్యం మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందని ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp users now can use OpenAI's ChatGPT and know how to activate
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X