వాట్సాప్ వీడియో కాల్స్‌కు ఎంత డేటా ఖర్చవుతుంది..?

ఇప్పటి వరకు బేటా టెస్టింగ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో అందరికి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాట్సాప్ కొద్ది గంటల క్రితం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Read More : ఆన్‌లైన్ షాపింగ్‌తో జరభద్రం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ తాజా నిర్ణయంతో..

వాట్సాప్ తాజా నిర్ణయంతో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది యూజర్లు ఎన్‌క్రిప్టెడ్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఆస్వాదించనున్నారు. 

వాట్సాప్ మాదిరిగానే..

వాట్సాప్ మాదిరిగానే స్కైప్, ఫేస్‌టైమ్ వంటి యాప్స్ కూడా తమ యూజర్లకు సెక్యూర్ వీడియో కాలింగ్ సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వై-ఫైకు కనెక్ట్ అయి ఉంటే..?

ఈ యాప్స్ ద్వారా వీడియో కాల్స్ చేసుకునే క్రమంలో మన ఫోన్ తప్సనిసరిగా వై-ఫై లేదా మొబైల్ డేటాకు కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ వై-ఫైకు కనెక్ట్ అయి ఉంటే డేటాతో సంబంధం లేకుండా వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

మొబైల్ నెట్‌వర్క్‌‌తో

ఒకవేళ మొబైల్ నెట్‌వర్క్‌‌తో వీడియో కాల్స్ చేసుకోవల్సి వస్తే ఖరీదైన విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ మూడు యాప్స్ 4 నిమిషాల వీడియో కాలింగ్ కు ఎంతెంత డేటాను ఖర్చుచేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఫేస్‌టైమ్ యాప్ ద్వారా చేసే కాల్స్‌కు..

యాపిల్ ఫేస్‌టైమ్ యాప్ ద్వారా చేసే 4 నిమిషాల వీడియో కాల్‌కు సగటున 8.8ఎంబి డేటా దాకా ఖర్చవుతోంది.

‌స్కైప్ ఇంకా వాట్సాప్ ద్వారా..

‌స్కైప్ యాప్ ద్వారా చేసే 4 నిమిషాల వీడియో కాల్‌కు సగటున 12.3 ఎంబి డేటా దాకా ఖర్చవుతోంది. వాట్సాప్ ద్వారా చేసే వీడియో కాల్స్‌కు సగటున 12.74 ఎంబి డేటా దాకా ఖర్చవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Video Calling vs Skype vs FaceTime. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot