Home
Apps

మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వాట్సాప్‌ సూపర్‌ ఫీచర్‌ వచ్చేస్తోంది.. మీకు కచ్చితంగా నచ్చే ఫీచర్‌ అవుతుంది!

వాట్సాప్‌ (Whatsapp) ప్రస్తుతం ఎక్కువ మంది కలిగిన యాప్స్‌ లో ఒకటిగా ఉంది. భారత్‌ లో వాట్సాప్‌ ను సుమారు 50 కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. భారీ స్థాయిలో ఉన్న యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్‌లను లాంచ్‌ చేసింది. యూజర్ల సౌకర్యం, భద్రత కోసం ఫీచర్‌లను తీసుకొచ్చింది. అయితే తాజాగా మరో సూపర్‌ ఫీచర్‌ ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ కోసం గత సంవత్సరం లోనే వెల్లడించింది. అయితే ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది.. యూజర్లకు ఎలా ఉపయోగపడుతుంది.

వాట్సాప్‌ లో టెక్స్ట్‌ మెసేజ్‌లతోపాటు వాయిస్‌ మెసేజ్‌ లు కూడా పంపేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం వాట్సాప్‌ ఆ వాయిస్‌ మెసేజ్‌లను కూడా టెక్ట్స్‌ రూపంలో మార్చేందుకు కొత్త ఫీచర్‌ ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ గురించి గత సంవత్సరం నవంబర్‌లోనే వివరాలు వెల్లడించింది.

Whatsapp Voice Message Transcription feature

ఉదాహరణకు మీరు ఏదైనా మీటింగ్‌ లేదా ట్రాఫిక్‌ లో ఉన్నారనుకోండి. మీకు వాట్సాప్‌ లో వాయిస్‌ మెసేజ్ వస్తే, వినేందుకు అవకాశం ఉండదు. ట్రాఫిక్‌ సౌండ్‌ సహా ఇతర కారణాలు ఉంటాయి. అలాంటి వాయిస్‌ మెసేజ్‌లను ఇక నుంచి టెక్ట్స్‌ గా మార్చుకొనేందుకు వాట్సాప్‌ అవకాశం కల్పిస్తోంది.

వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్‌ ను (Whatsapp Voice Message Transcription) ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, iOS యూజర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఈ ఫీచర్‌ కారణంగా ఎటువంటి ప్రైవసీ సమస్యలు వచ్చే అవకాశం లేదని వాట్సాప్‌ స్పష్టం చేసింది. వాయిస్ నుంచి టెక్ట్స్‌ గా మార్చే ప్రక్రియ అంతా స్మార్ట్‌ఫోన్‌ లోనే జరుగుతుందని, ఆ మెసేజ్‌ల యాక్సెస్‌ వాట్సాప్‌నకు కూడా ఉండదని తెలిపింది.

యూజర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అనేక భాషలకు సపోర్టు చేస్తుందని తెలిపింది. ఇంగ్లీష్‌, స్పానిష్‌, పోర్చుగీస్‌, రష్యన్ భాషల్లో అందుబాటులో ఉంది. భవిష్యత్‌లో మరిన్ని భాషలకు ఈ ఫీచర్‌ సపోర్టు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.

* వాట్సాప్ వాయిస్ మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్‌ ఎలా యాక్టివేట్‌ చేయాలి :
- తొలుత వాట్సాప్ సెట్సింగ్స్‌ మెనూలోకి వెళ్లాలి.
- అనంతరం Chats ను సెలెక్ట్‌ చేసుకోవాలి.
- అనంతరం Voice Message Transcripts ఆప్షన్‌ ను ఎంచుకోవాలి.
- ఆ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకొని, వారి భాషను ఎంచుకోవాలి.

* ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది :
- వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ అయ్యాక, మీకు వచ్చిన వాయిస్‌ మెసేజ్‌ను Long Press చేయాల్సి ఉంటుంది.
- అనంతరం అక్కడ కనిపించిన More Options పైన క్లిక్‌ చేయాలి.
- తర్వాత Transcribe ఆప్షన్‌ ను ఎంచుకోవాలి.
- మీకు వచ్చిన వాయిస్‌ మెసేజ్‌ టెక్ట్స్‌ రూపంలో అక్కడే కనిపిస్తుంది.

ఇటీవలే వాట్సాప్‌ మరో సూపర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. చాట్‌ థీమ్‌ పేరుతో అందుబాటులోకి వచ్చింది. తమకు నచ్చిన కలర్స్‌ను చాట్‌కు యాడ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌లో 30 రకాల వాల్ పేపర్ ఆప్షన్‌లు ఉంటాయి. దీంతోపాటు మీకు నచ్చిన ఫోటోలను కూడా చాట్‌ థీమ్‌గా పెట్టుకొనేందుకు అవకాశం ఉంది.

చాట్‌ థీమ్‌ను అన్ని చాట్‌లకు యాడ్‌ చేసుకోవచ్చు. లేదా ఎంపిక చేసుకున్న చాట్‌లకు మాత్రమే యాడ్‌ చేసుకొనే అవకాశం కూడా ఉంది. అయితే ఈ థీమ్‌ మీకు మాత్రమే కనిపిస్తుంది. మీరు చాట్‌ చేసుకున్న వ్యక్తులకు ఈ థీమ్ కనిపించే అవకాశం లేదని వాట్సాప్‌ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp Voice Message Transcription feature is rolling for users in india how to activate
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X