Home
Apps

Whatsapp Voice Note Transcription వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. వాయిస్‌ నోట్‌ను Text రూపంలోకి మార్చుకోవచ్చు..!

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ల కోసం అనేక కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. యూజర్లు భద్రత, సౌకర్యం కోసం ఇప్పటికే అనేక ఫీచర్‌లను లాంచ్ చేసింది. తాజాగా వాయిస్‌ నోట్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్‌ పై (Whatsapp Voice Note Transcription Feature) ప్రకటన చేసింది. ప్రస్తుతం వాట్సాప్ నుంచి వాయిస్‌ నోట్‌ ను పంపేందుకు వీలుండగా.. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా ఈ వాయిస్‌ నోట్‌ ను టెక్ట్స్‌గా మారుస్తుంది.

వాట్సా్ప్‌ వాయిస్‌ నోట్‌ను వినలేని పరిస్థితుల్లో.. ఈ వాయిస్‌ నోట్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్‌ సౌకర్యంగా ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ట్రాఫిక్‌ జామ్‌ లేదా ఏదైనా పార్టీలో ఉన్న సందర్భాల్లో వాట్సాప్‌ వాయిస్‌ నోట్‌ను వినేందుకు మరియు రిప్లే ఇచ్చేందుకు అవకాశం లేకపోవచ్చు. అలాంటి సమయాల్లో ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడనుంది.

Whatsapp Voice Note Transcription feature

వాట్సాప్‌ ఈ వాయిస్‌ ట్రాన్సిక్రిప్షన్‌ ఫీచర్‌ను మరికొన్ని వారాల్లో పూర్తి స్థాయిలో లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది. తొలి దశలో కొన్ని భాషలను మాత్రమే ఈ ఫీచర్‌ సపోర్టు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని తెలుస్తోంది.

వాట్సాప్‌ వాయిస్‌ ట్రాన్సిక్రిప్షన్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం చాట్‌ పైన క్లిక్‌ చేయాలి. తర్వాత వాయిస్ మెసేజ్‌ ట్రాన్సిక్రిప్షన్‌ పైన ట్యాప్‌ చేయాలి. అక్కడ ఉన్న టాగిల్‌ బటన్ ద్వారా ఈ ఫీచర్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేసేందుకు అవకాశం ఉంది. మరియు మీకు నచ్చిన భాషను ఎంచుకొనే అవకాశం ఉంది.

ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకున్న అనంతరం వాట్సాప్‌లో వచ్చిన వాయిస్‌ నోట్‌ పైన Long Press చేయాలి. అనంతరం అక్కడ కనిపించిన ట్రాన్స్‌క్రైబ్‌ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి. ఫలితంగా వాయిస్‌ నోట్‌ మీరు ఎంచుకున్న భాషలోకి అనువదించబడుతుంది.

ఈ ఫీచర్‌ మెరుగైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుందని వాట్సాప్‌ వెల్లడించింది. వాయిస్‌ నోట్స్‌ను ఇతర సర్వర్‌ లకు షేర్‌ చేయమని వాట్సాప్‌ స్పష్టం చేసింది. వాట్సాప్ కూడా వాయిస్‌ నోట్స్‌ను యాక్సెస్‌ చేయలేదని తెలిపింది. యాజర్ల డివైజ్‌లోనే వాయిస్‌ నోట్‌ నుంచి టెక్స్ట్‌ గా మార్పు చెందుతుందని, ఫలితంగా ఎటువంటి గోప్యతా సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదని తెలిపింది.

ఇటీవలే వాట్సాప్‌లో మెసేజ్‌ డ్రాఫ్ట్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఏదైనా వాట్సాప్‌ మెసేజ్‌ అసంపూర్తిగా టైప్‌ చేయకుండా ఉంటే అటువంటి మెసేజ్‌లు డ్రాఫ్ట్ లోకి వెళ్తాయి. ఆ మెసెజ్‌లను తర్వాత ఎడిట్‌ చేసి పంపించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ కారణంగా ఆ మెసేజ్‌లకు డ్రాఫ్ట్‌ లేబుల్ కనిపిస్తుంది. మరియు చాట్‌ లిస్ట్‌పైన పైన కనిపిస్తుంది.

దీని ద్వారా ఏదైనా కారణంతో అసంపూర్తిగా వదిలేసిన మెసేజ్‌లను, మళ్లీ ఎడిట్‌ చేసి పంపించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్, iOS యూజర్ల కు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసి ఈ ఫీచర్‌ ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Whatsapp Voice Note Transcription feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X