వాట్సాప్, ఫేస్‌బుక్, టెలీగ్రామ్.. ఏంటి వీటి మధ్య తేడా?

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, టెలీగ్రామ్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌‌ స్మార్ట్‌ఫోన్లలో తెగ సందడి చేస్తున్నాయి. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ ఆధునిక జీవితాల పై పెను ప్రభావం చూపుతున్నాయి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రమంగా పరిధిని విస్తరించుకుంటూ..

మెసేజింగ్ సౌకర్యంతో ఆవిర్భవించిన ఈ యాప్స్ ... వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, GIF సపోర్ట్, ఫోటో ఎడిటింగ్ ఇలా కొత్తకొత్త సదుపాయాలను చేర్చుకుంటూ పోతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ వీటిలో యాడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో ప్రముఖంగా వినిపిస్తోన్న వాట్సాప్, ఫేస్‌బుక్, టెలీగ్రామ్ యాప్‌లకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వాట్సాప్

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ యాప్‌లో అకౌంట్‌ను సెటప్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరి. వాట్సాప్ ద్వారా ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌తో పాటు ఆడియో, వీడియో ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు.

తాజాగా వాట్సాప్‌లో..

వాయిస్ ఇంకా వీడియో కాల్స్ కూడా యాడ్ అయ్యాయి. చాటింగ్‌ను మరింత రసవత్తరం చేసే క్రమంలో టెంపరరీ స్టేటస్ అప్‌డేట్స్ , జిఫ్ ఫైల్ సపోర్ట్, ఎమోటికాన్స్ వంటి సౌకర్యాలను కూడా ఈ యాప్ కల్పిస్తోంది. గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, ఐక్లౌడ్ వంటి థర్డ్ పార్టీ యాప్ లను కూడా వాట్సాప్ సపర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడు యూజర్లు

తమ వాట్సాప్ కంటెంట్ ను గూగుల్ డ్రైవ్ లోకి బ్యాకప్ చేసుకునే వీలుంటుంది. వాట్సాప్ అన్ని ప్రముఖ మొబైల్ ప్లాట్ ఫామ్ లను సపోర్ట్ చేస్తుంది.

 

ఫేస్‌బుక్ మెసెంజర్

వాట్సాప్ తరహాలోనే ఫేస్‌బుక్ మెసెంజర్ కూడా అన్ని రకాల మెసేజింగ్ సౌకర్యాలను ఆఫర్ చేస్తుంది. లైటర్ వర్షన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వచ్చే ఈ యాప్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌తో పాటు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, GIFs ఇంకా స్టిక్కర్‌లను సపోర్ట్ చేస్తుంది. తాజా అప్‌డేట్‌లో భాగంగా మీ లోకేషన్‌ను కూడా షేర్ చేసుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్ మెసెంజర్ కల్పిస్తోంది.

టెలీగ్రామ్

సెక్యూరిటీ పరంగా చూస్తే టెలీగ్రామ్ యాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తుంది. టెలీగ్రామ్ యాప్ 1జీబి వరకు ఫైల్స్‌ను సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్, ఫేస్‌బుక్ తరహాలోనే ఈ యాప్‌లో కూడా ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌తో పాటు ఫోటోలు ఇంకా ఆడియో, వీడియో ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Whatsapp vs Facebook Messenger vs Telegram: What makes them different. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot