వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్.. యాప్ అవసరం లేకుండానే..!
వాట్సాప్ (Whatsapp) తన యూజర్ల సౌకర్యం, భద్రత కోసం అనేక ఫీచర్లను తీసుకొస్తోంది. ఇటీవలే స్టేటస్ అప్‌డేట్స్ కోసం ఆకట్టుకొనే ఫీచర్ ను విడుదల చేస్తుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo తెలిపింది. దీంతోపాటు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పైన పనిచేస్తుందని కూడా తెలిపింది. అయితే వాట్సాప్ యూజర్లకు ఉపయోగపడే మరో సూపర్ ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
వెబ్ యాప్‌లలోనే ఈ ఫీచర్ ఉండగా :
వాట్సాప్ వెబ్ ఆప్షన్ ను ప్రస్తుతం అనేక మంది ఉపయోగిస్తున్నారు. వెబ్ ఆప్షన్ (బ్రౌజర్) ద్వారా చాటింగ్, స్టేటస్ అప్‌డేట్స్ ఫైల్ షేరింగ్ వంటివి సౌకర్యవంతంగా ఉన్నా.. వాయిస్, వీడియో కాల్స్ చేసేందుకు ప్రస్తుతం అవకాశం లేదు. విండోస్, macOS డెస్క్‌టాప్ యాప్ ద్వారా మాత్రమే ప్రస్తుతానికి అవకాశం ఉంది.

బీటా టెస్టర్‌లకు మాత్రమే :
బ్రౌజర్ లో వాట్సాప్ ను వినియోగిస్తున్న యూజర్లకు ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రం అందుబాటులో ఉంది. ప్రస్తుతం వన్ టు వన్ వాయిస్, వీడియో కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
వ్యక్తిగత కాలింగ్ కోసం మాత్రమే :
ఈ వివరాల ఆధారంగా వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ బ్రౌజర్ లోనూ త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా ప్రత్యేక వెబ్ యాప్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. అయితే తొలి దశలో వ్యక్తిగత కాల్స్ కు మాత్రమే ఈ ఫీచర్ సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. గ్రూప్ కాలింగ్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.
వాట్సాప్ వెబ్ లో మెసేజ్‌ల తరహా లోనే కాలింగ్ ఫీచర్ కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2E) సపోర్టు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యాప్ లో అందుబాటులోకి ఉన్నట్లుగా స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* వాట్సాప్ స్టేటస్ లో మరో ఆకట్టుకొనే ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ఇటీవలే వార్తలు వచ్చాయి. స్టేటస్ అప్‌డేట్ క్రియేట్ చేసే సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సహోద్యోగుల సహా యూజర్లకు కావాల్సినట్లుగా కస్టమైజ్ లిస్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు కచ్చితంగా లాంచ్ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా తీసుకొస్తారని ఇటీవలే లీక్స్ వచ్చాయి. ఇందులో ప్రీమియం స్టిక్కర్లు, మూడు కంటే ఎక్కువ చాట్స్‌ను పిన్ చేసుకొనే ఆప్షన్, యాప్ థీమ్‌లు సహా అనేక ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ కూడా అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫీచర్ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








