Home
Apps

Whatsapp Web మరింత యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్‌.. త్వరలో ఈ మార్పులను గమనిస్తారు..!

వాట్సాప్‌ ఇటీవల కాలంలో యూజర్ల కోసం అనేక కొత్త ఫీచర్లును అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌పైనా అధికంగా దృష్టిసారించింది. తాజాగా వెబ్‌ వెర్షన్‌లోనూ (Whatsapp Web) ఇదే తరహా మార్పులు చేస్తోందని తెలుస్తోంది. కొత్తగా చేస్తున్న మార్పులతో నావిగేషన్‌ మెరుగుపడుతుందని తెలుస్తోంది.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ప్రకారం వెబ్‌ వెర్షన్‌లో నావిగేషన్‌ ఎడమ వైపున కనిపించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సాప్‌ వెబ్‌ బీటా 2.3000.1012734542 అప్‌డేట్‌లో ఉంది.

Whatsapp Web redesigned sidebar interface

ఈ ఫీచర్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత సెప్టెంబర్‌ లోనూ ఇదే తరహా ఫీచర్‌ను వాట్సాప్‌ టెస్టింగ్‌ చేసింది. అయితే తాజాగా అందుబాటులోకి రానున్న డిజైన్ వాట్సాప్‌ వెబ్‌ను సులభంగా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను WAbetainfo షేర్‌ చేసింది.

చాట్‌, కమ్యూనిటీ, ఛానల్స్‌, స్టేటస్‌ సహా ఇతర అన్ని ఐకాన్‌ పొజిషన్‌లో వచ్చిన మార్పును ఈ స్క్రీన్‌ షాట్‌లో గుర్తించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉండగా.. త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరియు మెరుగైన అనుభూతిని కలిగిస్తుందని తెలుస్తోంది.

** వాట్సాప్‌ లో కొత్తగా జనరేటివ్‌ AI ఫీచర్‌ విడుదల అవుతోంది. మెటా AI చాట్‌బాట్‌ను వాట్సాప్‌ వినియోగదారులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే కొంత మంది యూజర్లకు ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ఈ మెటా AI.. లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారంగా రూపొందించారు.

మెటా కనెక్ట్‌ 2023 కార్యక్రమంలో మెటా సంస్థ ఈ ఏఐ మోడల్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి ఈ మెటా AI ని వాట్సాప్‌లో ఇంటిగ్రేషన్‌ కోసం అనేక మంది యూజర్లు ఎదురుచూస్తున్నారు. వాట్సాప్‌లో చాట్‌ జాబితాకు కుడి వైపున కొత్త గుర్తు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంగ్లీష్‌కు మాత్రమే సపోర్టు చేస్తోంది.

** వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo వివరాల ఆధారంగా త్వరలో అందుబాటులోకి రానున్న ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌కు వచ్చిన డాక్యుమెంట్‌లను సులభంగా చూడవచ్చు మరియు షేర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్‌కు వచ్చిన డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్‌ చేసి మాత్రమే చూడేందుకు వీలుండేది.

ఈ కొత్త ఫీచర్‌తో డౌన్‌లోడ్‌ అవసరం లేకుండానే వివరాలు తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రివ్యూ (Preview) ను జతచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉండగా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తొలుత ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. iOS వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సమాచారం అందుబాటులో లేదు.

** దీంతోపాటు వాట్సాప్‌ మరో ఆసక్తికర ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది. చాలా రోజుల నుంచి సంభాషించని వ్యక్తులను గుర్తించేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌ తొలుత ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది అని భావించినా.. తాజా వివరాల ఆధారంగా iOS యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంత మంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉందని సమాచారం. ఈ ఫీచర్‌ వాట్సాప్ వినియోగదారుల సంభాషణలను మెరుగుపరుస్తుందని వాట్సాప్‌ భావిస్తోంది. అయితే ఈ ఫీచర్‌ను డిసేబుల్‌ చేసుకొనే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp Web users may soon rollout new redesigned sidebar interface
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X