వాట్సప్‌లోకి మళ్లీ మరో మూడు కొత్త ఫీచర్లు..

Written By:

మెసేజింగ్ రంగంలో ఎవ్వరికీ అందనంత దూరంలో దూసుకుపోతున్న వాట్సప్ యూజర్ల కోసం ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని రకాల ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్న వాట్సప్ మరో మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. అతి త్వరలో యూజర్ల చెంతకు రానున్న ఈ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఈ ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్, మీ ఫోన్ చెక్ చేసుకోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫీచర్లు ఇవే..

ప్రైవేట్ రిప్లై, పీఐపీ మోడ్, ట్యాప్ టు అన్‌బ్లాక్ ఫీచర్లను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సప్ ప్రకటించింది.

ప్రైవేట్ రిప్లై ఫీచర్

ప్రైవేట్ రిప్లై ఫీచర్ ద్వారా గ్రూప్‌లో చాటింగ్ చేస్తున్న యూజర్లు వెనక్కి రాకుండానే అదే గ్రూప్‌లో ఉన్న ఎవ‌రైనా యూజర్‌కు ప్రైవేట్‌గా మరో విండోలో మెసేజ్‌లు పంపవచ్చు. అందుకు గాను గ్రూప్ చాట్ విండోలో ఉండే రిప్లై బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి.

పీఐపీ (పిక్చర్ ఇన్ పిక్చర్)

మరో ఫీచర్ అయిన పీఐపీ (పిక్చర్ ఇన్ పిక్చర్) మోడ్ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో వీడియో కాల్ చేస్తున్నప్పుడు, వీడియోలు చూస్తున్నప్పుడు వేరే కొత్త విండోలో అవి దర్శనమిస్తాయి.

ట్యాప్ టు అన్‌బ్లాక్ ఫీచర్..

ట్యాప్ టు అన్‌బ్లాక్ ఫీచర్ ద్వారా యూజర్ పేరుపై ప్రెస్ చేసి పట్టుకుంటే వారిని వాట్సప్‌లో అన్‌బ్లాక్ చేసేందుకు వీలుంటుంది.

ఐఫోన్ యూజర్లకు గ్రూప్ కాలింగ్ ఫీచర్‌

అదేవిధంగా ఐఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు.

త్వరలోనే పూర్తి స్థాయిలో..

అయితే ఈ ఫీచర్లన్నీ ఇప్పటికే వాట్సప్ బీటా వెర్షన్‌లో పలువురు ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాట్సప్ అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ ఫీచర్లు యూజర్లందరికీ అందుబాటులోకి వస్తాయని వాట్సప్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Web Will Soon Get Picture-in-Picture Mode, 'Reply Privately' Option: Report More News at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot