Home
Apps

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. చిన్న గ్రూపుల్లోనూ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు..!

మీరు ఏ మెసేంజర్‌ వినియోగిస్తున్నారు అని ఎవరినైనా అడిగితే ఎక్కువ శాతం మంది వాట్సాప్‌ అనే చెబుతారు. ఎందుకంటే వాట్సాప్‌ అంత పాపులర్‌. భారత్‌లో సుమారు 50 కోట్లకు పైగా వాట్సాప్‌ యూజర్లు ఉన్నారు. భారీ స్థాయిలో ఉన్న యూజర్ల కోసం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త సెక్యూరిటీ, ఇతర ఫీచర్‌లను తీసుకొస్తోంది. మరియు ఇప్పటికే ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను కూడా కలిగి ఉంది.

అయితే తాజాగా వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, iOS యూజర్ల కోసం విడుదల చేసింది. వాట్సాప్‌ గ్రూప్‌ల కోసం ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ (Whatsapp Voice Chat Feature) ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఎక్కువ మెంబర్లు ఉన్న గ్రూప్‌లకే ఈ ఫీచర్‌ సపోర్టు చేసేది.

whatsapp Auto HangOut

అయితే తాజాగా వాట్సాప్‌ ఇందులో మార్పులు చేసింది. తక్కువ మంది సభ్యులు ఉన్న గ్రూప్‌ లోనూ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. కనీసం 33 మంది సభ్యులు ఉంటేనే గతంలో ఈ ఫీచర్‌ను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉండేది. వాట్సాప్ Audio Hangout పేరుతో ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.

వాట్సాప్ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ ఉపయోగిస్తున్న సమయంలో గ్రూప్‌లోని సభ్యులకు ఎటువంటి రింగ్‌ వెళ్లదని చెబుతోంది. వాట్సాప్‌ గ్రూప్‌లోని అందరూ సభ్యులు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చని చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అనేక మందికి అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్, iOS యూజర్లు అందరికీ విడుదల కానుందని తెలిపింది.

Take a Poll

వాట్సాప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?
- వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను ఉపయోగించుకొనేందుకు వాట్సాప్‌ గ్రూప్‌ చాట్‌ను ఓపెన్‌ చేయాలి.
- చాట్‌లో కింది వైపు నుంచి Swipe up చేయాలి.
- అలా కాసేపు హోల్డ్‌ చేయాల్సి ఉంటుంది.
- అనంతరం ఈ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ అవుతుంది.
- ఈ చాట్‌ గ్రూప్‌ కింది భాగంలో (Pin) కనిపిస్తుంది.
- ఈ వాయిస్‌ చాట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపే యూజర్లు జాయిన్ కావచ్చు.
- నచ్చిన సమయంలో చాట్‌ను సులభంగా బయటకు రావచ్చు.
- కాల్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపని వారు కూడా.. చాట్‌లో ఎంతమంది ఉన్నారో చూసేందుకు అవకాశం ఉంటుంది.
- వాయిస్ చాట్‌కు కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టు ఉంటుందని వాట్సాప్‌ తెలిపింది.

వాట్సాప్‌లో ప్రస్తుతం అనేక సెక్యూరిటీ ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే అడ్వాన్స్‌డ్‌ చాట్‌ ప్రైవసీ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే.. మీ చాట్‌ను ఇతరులు ఎక్స్‌పోర్ట్‌ చేసేందుకు అవకాశం ఉండదు. దీంతోపాటు మీరు పంపిన ఫోటోలు, వీడియోలను అవతలి వ్యక్తులు సేవ్‌ చేసేందుకు అవకాశం ఉండదు.

ఈ ఫీచర్‌ కారణంగా మీ చాట్‌ భద్రంగా ఉంటుంది. ఇతరులకు షేర్‌ చేయడం మినహా ఎక్స్‌పోర్టు చేసేందుకు అవకాశం ఉండదు. అయితే స్క్రీన్‌ షాట్‌లు తీసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్‌ ఫోటోలను స్క్రీన్‌షాట్ తీయకుండా కట్టడి చేసే ఫీచర్‌ను ఇప్పటికే తీసుకొచ్చింది.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp will enable group voice chat feature called Auto HangOut to small groups
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X