Whatsapp Support ఈ ఫోన్‌లలో 2025 జనవరి 1 నుంచి వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ ఇదే..!
వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం వివిధ ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఇటీవల ఐఫోన్ ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్.. తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్‌లపై మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే సంవత్సరం మే నెల నుంచి iOS 15.1 కంటే ముందున్న ఐఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదని తెలిపింది. అయితే తాజాగా ఆండ్రాయిడ్ పాత OS తో పనిచేస్తున్న ఫోన్ లకు త్వరలో సేవలు నిలిపివేయనున్నట్లు వాట్సాప్ (Whatsapp to End Support to Old Android Smartphones) వెల్లడించింది.
ఎప్పటి నుంచి పాత ఫోన్‌లో వాట్సాప్ పనిచేయదు ? :
ఇటీవల కాలంలో వాట్సాప్ వంటి ప్లాట్‌ఫాంలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. అందువల్ల యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని క్రమంగా అప్‌డేట్ లను అందిస్తోంది. అయితే ఇప్పటికీ పాత OS తో పనిచేసే ఫోన్‌లు ఈ అప్‌డేట్‌లను సపోర్టు చేయడం లేదు. అందువల్ల జనవరి 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ తన సపోర్టును నిలిపివేయనుంది.

ఈ OS తో పనిచేసే ఫోన్‌కు వాట్సాప్ సపోర్టు నిలిపి వేస్తుంది :
2013 లో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ OS (Android KitKat OS) విడుదల అయింది. ప్రస్తుతం కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఈ OS పైన పనిచేస్తున్నాయి. జనవరి నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు. ఇందుకు సంబంధించిన జాబితా వెల్లడైంది. అయితే ఈ జాబితాలో ఉన్న ఫోన్‌లు సుమారు 10 సంవత్సరాల క్రితం విడుదల అయ్యాయి.
ఈ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయదు :
ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ S3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ Ace 3, గెలాక్సీ S4 మిని ఫోన్‌లు సహా మోటో G (జెన్ 1), Razr HD, మోటో E 2014 లు ఉన్నాయి. వీటితోపాటు LG ఆప్టిమస్ G, నెక్సాస్ 4, G2 మిని, L90, సోనీ ఎక్స్‌పీరియా Z, ఎక్స్‌పీరియా SP, ఎక్స్‌పీరియా T, ఎక్స్‌పీరియా V, HTC వన్ X, వన్ X ప్లస్, డిజైర్ 500, డిజైర్ 601 వంటి ఫోన్‌లు ఉన్నాయి.

ఇప్పటికే ఐఫోన్‌లపై ప్రకటన చేసిన వాట్సాప్ :
గతంలోనూ వాట్సాప్ ఈ తరహా నిర్ణయం తీసుకుంది. ఇటీవలే iOS 15.1, అంతకంటే పాత వెర్షన్ OS వెర్షన్‌లతో పనిచేస్తున్న ఐఫోన్‌లను సపోర్టు నిలిపివేయనున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లు వినియోగిస్తున్న వారు వెంటనే కొత్త ఫోన్‌లకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంది. ఈ గడువు 2025 మే నెల వరకు ఉంది.
ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడళ్లు గరిష్ఠంగా iOS 12.5.7 వెర్షన్ ను మాత్రమే సపోర్టు చేస్తాయి. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌లను అప్‌డేట్ అవకాశం లేదు. ఫలితంగా ఈ ఫోన్‌లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది. కొత్త ఫోన్లలో అదే నంబర్‌తో వాట్సాప్‌ను వినియోగించుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








