ఐఫోన్ యూజర్లకి షాకిచ్చిన వాట్సప్, వాటికి పనిచేయదట
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఐఫోన్ యూజర్లకి షాకిచ్చింది.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఐఫోన్ యూజర్లకి షాకిచ్చింది. పాత ఐఫోన్ యూజర్లకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఓఎస్ 7.1.2కి ముందున్న ఐఓఎస్ వెర్షన్లకు తమ యాప్ పనిచేయదని ప్రకటించింది. కాగా ఆపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12 ఐఫోన్ యూజర్ల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12ను సెప్టెంబర్17న విడుదల చేసింది.సరికొత్త ఫీచర్లతో, అప్‌డేట్లతో ఐఫోన్ యూజర్లను, ఐప్యాడ్ యూజర్లను ఇది అలరిస్తోంది. ఈ నేపథ్యంలో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది.

2020 ఫిబ్రవరి, 1 నుంచి..
2020 ఫిబ్రవరి, 1 నుంచి ఐఓఎస్ 7, దాని ముందున్న వెర్షన్లు వేటికి కూడా వాట్సప్ సపోర్టు చేయదని చెప్పేసింది. వాట్సప్ సపోర్టు చేసే ఐఫోన్ డివైజ్‌లను కూడా పేర్కొంది.

ఐఓఎస్ 7.1.2 యూజర్లకు..
ఐఓఎస్ 7.1.2 యూజర్లకు కూడా తమ యాప్‌ను వాడుకోవడానికి కొన్ని పరిమితులను విధించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన కొత్త ఎఫ్‌ఏక్యూ సెక్షన్‌లో వెల్లడించింది. ఐఓఎస్ 7.1.2 వచ్చిన తర్వాత ఐఫోన్ పాత డివైజ్‌లకు ఎలాంటి అప్‌డేట్లు లేదు.

ఐఓఎస్ 8
ఇక నుంచి కేవలం ఐఓఎస్ 8, ఆపై యూజర్లకు మాత్రమే వాట్సప్ పనిచేయనుందని స్పష్టం చేసింది. ‘ఐఫోన్‌కు వాట్సప్ కావాలంటే, ఐఓఎస్ 8 లేదా ఆ తర్వాతి వెర్షన్లు ఉండాల్సిందే'నని తేల్చి చెప్పింది.

కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకోవడానికి..
1 ఫిబ్రవరి, 2020 తర్వాత కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకోవడానికి, పాత అకౌంట్లను పునఃధృవీకరించుకోవడానికి కూడా కుదరదు. అయితే ఈ ప్రభావం ఎక్కువ మంది యూజర్లపై పడదని తెలుస్తోంది.

ఐఫోన్ 4కు, ఐఫోన్ 3జీఎస్‌లకు.
ముఖ్యంగా ఐఫోన్ 4కు, ఐఫోన్ 3జీఎస్‌లకు. ఐఫోన్ 4ను 2010లో లాంచ్ చేయగా.. ఐఫోన్ 3జీఎస్ 2009లో మార్కెట్‌లోకి వచ్చింది. ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6.1.6 తర్వాత ఇక ఎలాంటి అప్‌డేట్‌ను పొందలేదు.

2008లో లాంచ్ అయిన..
2008లో లాంచ్ అయిన ఐఫోన్ 3జీ కి కూడా వాట్సప్ పనిచేయదు. అయితే 2011లో లాంచ్ అయిన ఐఫోన్ 4ఎస్‌లకు చివరి అప్‌డేట్ ఐఓఎస్ 8.4.1. దీంతో వీటికి వాట్సప్ పనిచేస్తుంది.

85 శాతం యాక్టివ్ డివైజ్‌లు..
85 శాతం యాక్టివ్ డివైజ్‌లు ఐఓఎస్ 11తో పనిచేస్తూ ఉండగా.. ఐఓఎస్ 10తో 10 శాతం, పాత వెర్షన్లతో మిగిలిన 5 శాతం పనిచేస్తున్నాయి. అంటే ఐఓఎస్ 10కు ముందున్న వెర్షన్ డివైజ్‌లు లక్షల్లో కొన్ని మాత్రమే.


Click it and Unblock the Notifications








