రేపటి నుంచి వాట్సాప్ ఈ ఫోన్లలో పనిచేయదు

|

ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థ వాట్సాప్ కొన్ని భద్రత మరియు గోప్యత కారణాల వల్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పాత వెర్షన్ల మొబైల్ ఫోన్లకు తన మద్దతును తొలగిస్తోంది. గతంలో ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ అనేక ఆండ్రాయిడ్, ios, బ్లాక్‌బెర్రీ మరియు విండోస్ ఫోన్ డివైస్ లకు మద్దతును అందించడం మానుకున్నది. ఇప్పుడు కంపెనీ మళ్లీ దాని జాబితాను అప్డేట్ చేసింది.

 

విండోస్ ఫోన్

డిసెంబర్ 31, 2019 తరువాత చాలా రకాల విండోస్ ఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మరియు విండోస్ ఫోన్ల పాత వెర్షన్లలో ఇక మీదట వాట్సాప్ యాప్ పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ ఇప్పటికే వినియోగదారులకు ముందుగానే తెలియజేసింది.

గ్లాన్స్ లాక్‌స్క్రీన్: గొప్ప అనుభవంతో న్యూస్ చదవడానికి అద్భుతమైన వేదికగ్లాన్స్ లాక్‌స్క్రీన్: గొప్ప అనుభవంతో న్యూస్ చదవడానికి అద్భుతమైన వేదిక

 

 

మెసేజ్ ప్లాట్‌ఫామ్‌
 

మెసేజ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఇండియాలో సుమారు 400 మిలియన్లకు పైగా వినియోగదారులు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ అధిక ప్రజాదరణను పొందడానికి వెనుక అతిపెద్ద కారణం దాని సరళత మరియు అధిక సంఖ్యలో వినియోగదారులకు ఇది అందించే ఫీచర్స్. అలాగే ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో మరొక ఉత్తమమైన విషయం ఏమిటంటే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గ్రూప్ వీడియో లేదా వాయిస్ చాట్‌లను ఉచితంగా చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

 

ముఖ్యమైన 26 ఛానెల్‌ల ధరలను తగ్గించిన టాటా స్కైముఖ్యమైన 26 ఛానెల్‌ల ధరలను తగ్గించిన టాటా స్కై

విండోస్ ఫోన్‌లకు వాట్సాప్ సపోర్ట్ ఎండింగ్

విండోస్ ఫోన్‌లకు వాట్సాప్ సపోర్ట్ ఎండింగ్

ఈ రోజు వరకు వాట్సాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో విండోస్ ఫోన్ 8.1 లేదా అంతకు మించిన OS ఫోన్ లలో మాత్రమే రన్ అవుతుంది. కాని జనవరి 1, 2020 నుండి ఈ మద్దతు తొలగించబడుతుంది. డిసెంబర్ 31, 2019 తర్వాత విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను కలిగి ఉన్న ఫోన్ వినియోగదారులు వాట్సాప్ ను ఉపయోగించలేరు అని కంపెనీ తెలిపింది. సంస్థ ప్రకారం వాట్సాప్ యాప్ మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి కూడా తొలగించబడవచ్చు. కానీ ఇది KaiOS 2.5.1+ OS ఉన్న ఎంచుకున్న ఫోన్‌లకు అందుబాటులో ఉంటుంది. వీటిలో జియోఫోన్ మరియు జియోఫోన్ 2 ఉన్నాయి.

IOS మరియు ఆండ్రాయిడ్ జాబితాకు WhatsApp మద్దతు

IOS మరియు ఆండ్రాయిడ్ జాబితాకు WhatsApp మద్దతు

2020 ఫిబ్రవరి 1 తర్వాత iOS 8 లేదా అంతకంటే ముందు iOSతో రన్ అవుతున్న iOS డివైస్ లలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7 మరియు అంతకంటే పాత వెర్షన్ లతో రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ క్రొత్త అకౌంట్ లను సృష్టించలేరు. అలాగే ఇప్పుడు ఉన్న అకౌంట్ లను కూడా తిరిగి ధృవీకరించలేరు. అయితే మీరు ఫిబ్రవరి 1, 2020 వరకు ఇందులో వాట్సాప్ వాడకాన్ని కొనసాగించవచ్చు. 2.3.7 మరియు పాత వెర్షన్‌లలో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ ఇకపై పనిచేయదని బ్లాగ్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
WhatsApp Will not Support on These Phones From Tomorrow

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X