Whatsapp లో యూట్యూబ్ తరహా ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?
మెటా నేతృత్వంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp).. మరో కీలక ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో (Youtube) ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వీడియోలను మరింత సౌకర్యవంతంగా చూసేందుకు వీలుగా వాట్సాప్ ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.
ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది. వాట్సాప్ వీడియోను ముందుకు, వెనక్కి (Video Forward and Backward) కదిలించవచ్చని తెలిపింది. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ తరహా ఫీచర్ అందుబాటులో ఉందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.

టెస్టింగ్ దశలో: ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న విధానం కంటే త్వరలో రానున్న ఫీచర్ మరింత సౌకర్యవంతంగా వీడియోలు చూసేందుకు అనుమతి ఇస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
ఈ ఫీచర్ కంటెంట్ నావిగేషన్‌ను మెరుగుపరుస్తుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. వీడియోలో కచ్చితమైన భాగాన్ని చూసేందుకు Whatsapp Skip forward and Backward ఫీచర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్ రానున్న వారాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

* వాట్సాప్ గత అప్‌డేట్‌లోనే గ్రూప్ కాలింగ్ సభ్యుల సంఖ్యను 32కు పెంచింది. అయితే ఇప్పటి వరకు కేవలం 15 మందిని ఆహ్వానించేందుకు మాత్రమే అవకాశం ఉండేది. మిగిలిన యూజర్లు మాన్యుల్‌గా పాల్గొనేందుకు అవకాశం ఉండేది. తాజా అప్‌గ్రేడ్‌తో 31 మందిని గ్రూప్ కాల్‌కు (Whatsapp Group calling) ఆహ్వానించవచ్చు. ఈ ఫీచర్ iOS యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుందని WABetainfo తెలిపింది.
* వాట్సాప్ మరో కీలక ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. వాట్సాప్ ప్రత్యామ్నాయ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
యూజర్ల తన ప్రొఫైల్ వివరాలను ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయవచ్చు. ప్రత్యామ్నయ ప్రొఫైల్‌లో పేరు, ఫోటోను కూడా మార్చుకోవచ్చు. ఫలితంగా మీ వివరాలు మరింత గోప్యంగా ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
* వాట్సాప్ వెబ్ యూజర్లకు మరో మెరుగైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ వాట్సాప్ స్క్రీన్ లాక్ (Whatsapp Screen Lock) ఫీచర్‌తో వెబ్‌ను లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్లకు మరింత భద్రతను కల్పిస్తుంది. ఆఫీస్ సహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న సమయంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవుతాం. అయితే విరామ సమయంలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లాగవుట్ చేసి వెళ్తుంటాం.
మళ్లీ కంప్యూటర్ వద్దకు వచ్చాక మరోసారి లాగిన్ అవుతాం. ఇదంతా కొన్నిసార్లు ఇబ్బంది అనిపించవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ లాక్ స్క్రీన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో విరామ సమయంలో వాట్సాప్ వెబ్ స్క్రీన్‌ను లాక్ చేసుకోవచ్చు. మళ్లీ పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావచ్చు. ఆటోమేటిక్ స్క్రీన్ లాక్ టైమింగ్‌ను ఎంచుకొనే ఆప్షన్ ఈ ఫీచర్‌లో ఉంది.
* వాట్సాప్‌లో లాక్ చేసిన చాట్‌ను మరింత గోప్యంగా ఉంచుకొనే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. ఈ Locked Chat ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు సీక్రెట్ కోడ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








