Home
Apps

Whatsapp లో కొత్త ఫీచర్‌.. చాట్‌, గ్రూప్‌చాట్‌ వద్ద ఈ లేబుల్‌ కనిపిస్తుంది.. ఎందుకో తెలుసా?

మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్ల కలిగిన యాప్‌ల జాబితాలో ఉంది. వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం గత కొన్ని నెలలుగా వాట్సాప్‌ అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ Wabetainfo కీలక సమాచారం వెల్లడించింది.

ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్క్రిప్షన్‌: వాట్సాప్ సంస్థ ప్రకారం ప్రతి చాట్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ను (Whatsapp end to end Encryption label) కలిగి ఉంటుంది. అయితే చాటింగ్ సమయంలో ఇందుకు సంబంధించి ఎటువంటి సింబల్‌ లేదా లేబుల్‌ కనిపించదు. అయితే త్వరలో ఇందుకు సంబంధించి లేబుల్‌ చాట్‌ స్క్రీన్‌పైన కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉందని వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ తెలిపింది.

whatsapp will roll out new feature that will show an encryption label at the chat

ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ లేబుల్‌ : ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్లో అందుబాటులో ఉందని Wabetainfo తెలిపింది. ఆండ్రాయిడ్‌ బీటా వినియోగదారులకు గత కొన్ని రోజులుగా ఈ ఫీచర్‌ (whatsapp New Feature) అందుబాటులో ఉందని తెలిపింది. వాట్పాస్ ఆండ్రాయిడ్‌ బీటా 2.24.3.17 అప్‌డేట్‌లో గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌ కింద ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ లేబుల్‌ కనిపిస్తోంది.

యాజర్ల చాట్‌, వీడియోలు సహా ఇతర కంటెంట్‌కు అధిక ప్రాధాన్యతతో కూడిన భద్రతను కలిపిస్తున్నట్లు చెబుతున్న వాట్సాప్‌ సంస్థ తన భద్రత గురించి వినియోగదారులకు తెలియజేసేందుకు ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర యాప్‌ల ద్వారా వాట్సాప్‌లో చాట్‌ చేసేవారి చాటా డేటా కూడా ఎంతో భద్రంగా ఉంటుందని వాట్సాప్‌ చెబుతోంది.

** వాట్సాప్‌లో ఇటీవల కీలక ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా తేదీల వారీగా చాట్‌ను సెర్చ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ ఇప్పటికే iOS, Mac డెస్క్‌టాప్‌, వాట్సాప్‌ వెబ్‌ ద్వారా అందుబాటులో ఉండగా ఇటీవలే ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

** వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్ల ప్రొఫైల్‌ ఫొటోలను స్క్రీన్‌ షాట్‌ తీసే అవకాశం ఉందదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా 2.24.4.25 వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

** ఇప్పటి వరకు పాత చాట్‌లను వెతికేందుకు కేవలం స్క్రోల్‌ చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆయా తేదీల వారీగా చాట్‌ వివరాలను సెర్చ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా పాత చాట్‌లోని వివరాలను ఇప్పుడు సులభంగా వెతకవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.

** వాట్సాప్‌లో ఇటీవల కొన్ని కొత్త టెక్ట్స్‌ ఫార్మాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా మీ మెసెజ్‌లను బుల్లెట్‌, నంబర్‌, బ్లాక్‌ కోట్‌, ఇన్‌లైన్‌ కోడ్‌ ఫార్మాట్‌ చేయడంలో నాలుగు కొత్త టెక్ట్స్‌ ఫార్మాట్‌లను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులోకి ఉన్న ఫీచర్లతోపాటు బోల్డ్‌, స్ట్రైక్‌ త్రూ, ఇటాలిక్‌, మోనో స్పేస్‌ అదనంగా చేర్చబడ్డాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp will roll out new feature that will show an encryption label at the chat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X