Home
Apps

ఫోన్‌ నంబర్‌తో పనిలేకుండా కొత్త వ్యక్తులతో వాట్సాప్‌లో చాట్‌ చేయవచ్చు.. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది..!

వాట్సాప్‌ ఇటీవల కాలంలో అనేక ఫీచర్ల ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం అనేక ఫీచర్లను లాంచ్ చేస్తోంది. అయితే తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ ను తీసుకురానుంది. ఇప్పటి వరకు వాట్సాప్‌ అకౌంట్‌ ను క్రియేట్‌ చేయాలంటే కచ్చితంగా ఫోన్‌ నంబర్‌ కావాలి. అయితే తాజాగా అందుబాటులోకి రానున్న ఫీచర్‌ ద్వారా యూజర్‌ నేమ్‌ క్రియేట్‌ (Whatsapp User Name) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo వెల్లడించింది.

ఈ వివరాల ఆధారంగా వాట్సాప్‌ ప్రస్తుతం కొత్త ఫీచర్‌ పైన పనిచేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్‌ నేమ్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇతరులకు మెసేజ్‌ చేసే సమయంలో ఫోన్‌ నంబర్‌ కు బదులుగా యూజర్‌ నేమ్‌ ద్వారా చాట్ చేయవచ్చు. కొత్త వ్యక్తులతో చాట్ చేసే సమయంలో మీ ఫోన్ నంబర్‌ ను షేర్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సా్ప్‌ వెబ్‌ యూజర్ల కు మాత్రమే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

whatsapp will soon allow users to create unique user

వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్ ఆధారంగా ప్రస్తుతం ఈ యూజర్‌ నేమ్‌ ఫీచర్‌ ను అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఇతర సోషల్‌ మీడియాలకు ఉపయోగిస్తున్న విధంగా యూజర్‌ నేమ్‌ ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్‌ ఇతరులు క్రియేట్‌ చేసేందుకు వీలుండదని తెలుస్తోంది.

ఈ కొత్త ఫీచర్‌ వల్ల వాట్సాప్ వినియోగదారులకు మరింత భద్రత కలుగుతుంది. కొత్త వారికి వాట్సాప్‌లో మెసేజ్‌ చేసిన సమయంలో మన ఫోన్‌ నంబర్‌కు బదులుగా కేవలం యూజర్ నేమ్‌ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మీరు పరస్పరం ఫోన్‌ నంబర్లు షేర్‌ చేసుకున్నట్లయితే.. వాట్సాప్‌ అకౌంట్‌లో మీ ఫోన్‌ నంబర్‌ ను గుర్తించవచ్చు.

ఈ ఫీచర్‌ కోసం గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే ఎప్పటి నుంచి కచ్చితంగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న భద్రతతోపాటు ఈ ఫీచర్‌ కారణంగా మరింత భద్రతను పొందవచ్చని తెలుస్తోంది.

వాట్సాప్‌లో ఇటీవలే favourites పేరుతో కొత్త ట్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. మీకు నచ్చిన, ముఖ్యమైన కాంటాక్ట్‌లను ఆ ట్యాబ్‌లోనికి యాడ్‌ చేసుకొనే అవకాశం ఉంది. వాట్సాప్‌ బ్లాగ్‌ పోస్ట్‌ ఆధారంగా.. ఈ కొత్త ఫీచర్‌తో ముఖ్యమైన చాట్‌, గ్రూప్‌లను ప్రత్యేకంగా నిర్వహించుకొనే అవకాశం ఉంటుంది. కాల్‌ ట్యాబ్‌ వద్ద ముఖ్యమైన వీటిని పిన్‌ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. కాల్‌ ట్యాబ్‌లో ఇప్పటికే అందుబాటులో "Add Favourites" యాడ్‌ చేయవచ్చు. చాట్‌ లిస్ట్ నుంచి కూడా యాడ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ అనేక మందికి అందుబాటులోకి రాగా.. త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. ఇందుకోసం వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp will soon allow users to create unique user name here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X