వాట్సప్‌లోకి కొత్త ఫీచర్, Spam మెసేజ్‌లు అవుట్ !

Written By:

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తూ వస్తున్నది. అందులో భాగంగానే ఈ మధ్యే పేమెంట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాగా త్వరలో మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. వాట్సప్‌లో ఫార్వార్డెడ్ మెసేజ్ పేరిట రానున్న ఈ ఫీచర్ వల్ల ఇకపై అందులో యూజర్లు స్పాం మెసేజ్‌లను పంపడం కుదరదు. ఏదైనా ఒక మెసేజ్ కనీసం 25 సార్లకు పైగా ఫార్వార్డ్ అయితే దాన్ని వాట్సప్ ఫార్వార్డెడ్ మెసేజ్‌గా గుర్తిస్తుంది. దీంతో ఆ మెసేజ్‌ను యూజర్లు బ్లాక్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ క్రమంలో వాట్సప్‌లో పెద్ద ఎత్తున నకిలీ, స్పాం మెసేజ్‌లను పంపడానికి ఇకపై వీలు కాదు.

BSNL హోలీ ధమాకా, జియో కన్నా ఎక్కువ డేటా !

వాట్సప్‌లోకి కొత్త ఫీచర్, Spam మెసేజ్‌లు అవుట్ !

ప్రస్తుతం వాట్సప్ ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలో యూజర్లకు దీన్ని అందుబాటులోకి తేనుంది. వాట్సప్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ ఫీచర్‌ను స్పాట్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ వీ2.18.67 వాట్సాప్‌ బీటాలో ఈ ఫీచర్‌ కనిపించింది. దీంతో పాటు స్టికర్స్‌ ఫీచర్‌ కూడా విండోస్‌ ఫోన్‌ బీటాపై స్పాట్‌ అయింది. ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌కు కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. వాట్సాప్‌ ఇటీవలే గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ అనే ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, విండోస్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులెవరైనా సరే గ్రూప్ డిస్క్రిప్షన్‌ను ఎడిట్ చేసే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది.

మీ వాట్సప్ ప్రొఫైల్ ఎవరు చూసారో తెలుసుకోవడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రిక్ 1

ముందుగా మీ మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి వాట్సప్ వ్యూ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

ట్రిక్ 2
దాన్ని ఇన్‌స్టాల్ చేసిన తరువాత ఓపెన్ చేయాలి. అక్కడ మీకు అల్లో బటన్ కనిపిస్తుంది. దాన్ని కాంటాక్ట్స్ యాక్సెస్ చేయమంటారా అని అడుగుతుంది. దాన్ని మీరు ఓకే చేయాలి.

ట్రిక్ 3

అది ఒకే చేసిన తరువాత మీకు మీ వాట్సప్ ప్రొఫైల్ ఎవరెవరు చూసారు అన్న విషయం తెలిసిపోతుంది. అక్కడ మోస్ట్ వ్యూయర్ విజిటర్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలు.

వాట్స్ ట్రాక్

ఇక ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. అయితే వాటిల్లో మనకు నచ్చినది సెలక్ట్ చేసుకుని ఫాలో అవడం ఉత్తమం. వాట్స్ ట్రాక్ కూడా ఇందులో ఉంది.

క్లిక్ చేస్తే

దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు యాక్సస్ ఆప్సన్ వస్తుంది. దీనిలో కూడా మీరు అది చెక్ చేసుకోవచ్చు.

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

ఎవరో తెలియకుండా అందరికీ మెసేజ్ లు

దీని ద్వారా మీరు ఎవరో తెలియకుండా అందరికీ మెసేజ్ లు పంపవచ్చు. అంటే మీ నెంబర్ కూడా వారికి తెలియదు. ఒక మెయిల్ లాగా ఇది ఉంటుంది. దీనికోసం మీరు Go to Chats -> Broadcast Lists -> New List -> add contacts చేసుకుని మీ మెసేజ్ ని పంపవచ్చు.

ఢిపరెంట్ గా టైప్

మీరు వాట్సప్ లో ఢిపరెంట్ గా టైప్ చేయాలనుకుంటున్నారా..బోల్డ్ అలాగే ఇటాలిక్ తో పాటు స్ట్రయిక్ ద్రోని టైప్ చేయాలంటే మీరు చేయొచ్చు. బోల్డ్ గా టైప్ చేయాలనుకుంటే *love*,ఇటాలిక్ అయితే _italics_ , ~strikethrough~ని ఇలా టైప్ చేస్తే చాలు. రెండూ కావాలనుకుంటే _*bolditalics*_ ఇలా టైప్ చేయండి.

ఎక్కువగా ఎవరితో మాట్లాడారో

మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడారో అలాగే ఎవరితో చాట్ చేశారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Account -> Storage Usageలో కెళ్లి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఐఓఎస్ మాత్రమే లభిస్తుంది.

డేటా వాడకం

మీ డేటా వాడకం ఎంత జరిగిందో తెలుసుకోవాలనుకుంటే Settings -> Data Usage -> Network Usage. లో కెళ్లి మీరు తెలుసుకోవచ్చు.

మ్యూట్

మీరు గ్రూప్ మెసేజ్ లతో విసిగిపోతో దాన్ని మ్యూట్ లో పెట్టుకోవచ్చు. వన్ ఇయర్ వరకు మీకు ఎటువంటి అంతరాయం కలగకుండా మ్యూట్ లో పెట్టుకునే ఛాన్స్ ఉంది.

Privacy and change

మీ ఇన్ఫర్ మేషన్ అందరికీ తెలియకుండా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Account -> Privacy and change లో కెళ్లి అక్కడ కనిపిస్తున్న వాటిమీద క్లిక్ చేసి మై కాంటాక్ట్స్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

బ్లూ ట్రిక్స్

మీరు ఈ బ్లూ ట్రిక్స్ కనపడకుండా చేసుకోవాలనుకుంటే Settings -> Account -> Privacy and toggle Read Receipts off చేస్తే సరిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp will soon have a ‘Forwarded message’ feature: Here’s what it means More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot