వాట్సప్ మళ్లీ షాకిచ్చింది, ఈ ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. అలాంటి యాప్ యూజర్లకు ఈ మధ్య షాకులిస్తూ పోతోంది. ఈ మధ్య వాట్సప్ కొన్ని ఫోన్లకు పనిచేయకుండా పోతోంది. ఇప్పటికే బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత వాటికి వాట్సప్ పనిచేయడం గతేడాది చివరి నుంచి ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా మరికొన్ని ఫోన్లకు కూడా ఈ సేవలు ఆగిపోనున్నాయి.

నోకియా ఎస్40
నోకియా ఎస్40 డివైజ్‌లకు వాట్సప్ సేవలు ఈ ఏడాది చివరి నుంచి నిలిచిపోనున్నాయి. దీంతో పాటు మరికొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు కూడా వాట్సప్ పనిచేయదని రిపోర్టులు చెబుతున్నాయి.

Android Gingerbread
Android Gingerbread ఆధారిత స్మార్ట్‌ఫోన్లకు కూడా 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ ఆగిపోనుందని తెలుస్తోంది.

3.9 మిలియన్ మంది యూజర్లు
ఈ జింజర్‌బ్రెడ్ లేదా వెర్షన్ 2.ఎక్స్.ఎక్స్ యూజర్లకు తొలుత 2010లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెర్షన్ వాడే వారు 3.9 మిలియన్ మంది యూజర్లున్నారు. అంటే మొత్తం ఆండ్రాయిడ్ యూజర్లలో 0.3 శాతం మంది.

ఐఓఎస్7 డివైజ్
దీంతో పాటు ఐఓఎస్7 డివైజ్‌లకు కూడా ఇదే తేదీ నుంచి వాట్సప్ సపోర్టు చేయదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

2020 ఫిబ్రవరి 1 నుంచి.
Android Gingerbread ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సపోర్టును కోల్పోనున్నారని రిపోర్టులు తెలిపాయి. ఈ వెర్షన్ ఉన్న వారు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రస్తుత వెర్షన్‌లోకి అప్‌గ్రేడ్ అవ్వాలని సూచించాయి.

వాట్సప్ ఇటీవలే తన యూజర్లకు
వాట్సప్ ఇటీవలే తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను ఆఫర్ చేయడం ప్రారంభించింది. తన సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ.. వారికి వినూత్నమైన ఆఫర్లను అందించాలని వాట్సాప్ ఈ ఫీచర్లను తీసుకొస్తోంది.

గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను..
గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఇటీవలే వాట్సప్ తన ఎంపిక చేసిన యూజర్లకు లాంచ్ చేసింది. వాట్సప్ గ్రూప్ వీడియో కాలింగ్ అచ్చం ఫేస్‌బుక్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను పోలి ఉంది.

వివిధ రకాల స్టిక్కర్లను
ఇప్పటికే వివిధ రకాల స్టిక్కర్లను వాట్సప్ బయటకు తీసుకువచ్చింది. ఇంకా అనేక రకాలైన స్టికర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది.


Click it and Unblock the Notifications








