ఈ ఫోన్‌లను వాడుతున్నారా!!! అయితే ఇక పై వాట్సాప్ పనిచేయదు...
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన వాట్సాప్ గత సంవత్సరం కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల కోసం తన యొక్క అన్ని రకాల సేవల మద్దతును ముగించింది. అయితే ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కొన్ని ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో తన యొక్క మద్దతును ముగించనున్నట్లు తాజా నివేదికలో తెలిపింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సర్వీసులు ఆగిపోయే పాత ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iOS 9 లేదా ఆండ్రాయిడ్ 4.0.3 ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్
కొత్తగా విడుదల అయిన నివేదికల ప్రకారం ఐఫోన్‌లలో iOS 9 లేదా ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రన్ అయ్యే ఐఫోన్‌లలో వాట్సాప్ యొక్క అన్ని సేవల మద్దతు ముగియనున్నాయి. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ఇటీవల విడుదల చేసిన అన్ని కొత్త వాట్సాప్ ఫీచర్‌లను ఆస్వాదించడానికి యూజర్లు తమ యొక్క ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్‌కు అప్ డేట్ చేసుకోమని వినియోగదారులను సిఫార్సు చేస్తుంది.

వాట్సాప్ కొత్త ఫీచర్స్ అప్‌గ్రేడ్
గ్రూప్ వీడియో కాల్‌లలో పాల్గొనేవారి సంఖ్యను విస్తరించడం నుండి ఫార్వార్డ్ మెసేజ్ లను పరిమితం చేయడం వరకు ఈ సంవత్సరం అనేక కొత్త ఫీచర్లను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్లను ఆస్వాదించడానికి పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్న ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఈ ఏడాది చివరి నాటికి అప్‌గ్రేడ్ చేసుకోవాలి అని తెలిపింది. ఒక వేల అప్‌గ్రేడ్ పూర్తి చేయకపోతే కనుక 2021 నుండి వాట్సాప్ ద్వారా మరొకరితో కనెక్ట్ అవ్వడానికి వీలు ఉండదు.

2021 నుండి వాట్సాప్ ఈ ఐఫోన్ లలో పనిచేయదు
వాట్సాప్ ను వినియోగిస్తున్న ఐఫోన్ వినియోగదారులు తమ ఐఫోన్‌లలో iOS 9 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 4.0.3 మరియు కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని కోరారు. అయితే ఐఫోన్ 4 వరకు ఉన్న అన్ని ఐఫోన్ మోడల్స్ వాట్సాప్ యొక్క మద్దతును కోల్పోనున్నాయి. ఈ మోడళ్లలో ఐఫోన్ 4S, ఐఫోన్ 5, ఐఫోన్ 5S, ఐఫోన్ 6 మరియు ఐఫోన్ 6S వంటివి ఉన్నాయి. ఈ మెసేజ్ యాప్ ను ఉపయోగించడం కొనసాగించడానికి మరియు వారి ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి వినియోగదారులు వెంటనే తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను iOS 9 కు లేదా కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయవలసి ఉంటుంది.

2021 నుండి వాట్సాప్ ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయదు
ఆండ్రాయిడ్ ఫీచర్లతో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే వాట్సాప్ మెసేజ్ యాప్ ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా ముందు వెర్షన్‌లో రన్ అవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయడం మానేస్తుందని వెల్లడించింది. ఈ పాత సాఫ్ట్‌వేర్‌లను ఎక్కువ ఫోన్ లలో ఉపయోగించడం లేదు కాబట్టి ఈ చర్య ఎక్కువ మంది వినియోగదారులను ప్రభావితం చేయకపోవచ్చు. పాత OS లో ఇప్పటికీ నడుస్తున్న కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో హెచ్‌టిసి డిజైర్, LG ఆప్టిమస్ బ్లాక్, మోటరోలా డ్రాయిడ్ రేజర్ మరియు శామ్‌సంగ్ గెలాక్సీ S2 వంటివి ఉన్నాయి. కాబట్టి మీ Android ఫోన్ ను వెంటనే ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్‌లోకి లేదా కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి అని నిర్దారించుకోండి.


Click it and Unblock the Notifications








