వాట్సాప్ కీలక ఫీచర్.. స్టేటస్ పోస్టులు ఎక్కువగా చేసే వారికి ఉపయోగం..!!
మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల (Whatsapp latest Features) కోసం ఇటీవల కాలంలో అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. మరియు ఇటీవల కాలంలో వినియోగదారుల భద్రత కోసం కూడా వివిధ అప్ డేట్ లను విడుదల చేస్తోంది. దీంతోపాటు వాట్సాప్ ఇంటర్ ఫేస్ లోనూ మార్పులు చేసింది. మరియు కాలింగ్ ఇంటర్ ఫేస్ లోనూ మార్పులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం బీటా టెస్టర్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
అయితే తాజాగా వాట్సాప్ Mac యూజర్ల కోసం మరో ఆసక్తికర ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ అప్‌డేట్ అందుబాటులోకి వస్తే mac యూజర్లు నేరుగా వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్ నుంచే స్టేటస్ పోస్టులు పెట్టే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ఇటీవలే ఆండ్రాయిడ్ లో అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్ బీటా mac వెర్షన్ 24.11.73 లో ప్రస్తుత వెర్షన్ అందుబాటులో ఉంది. బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా మ్యాక్‌లో స్టేటస్ ట్యాబ్ ద్వారా స్టేటస్ పోస్ట్‌లు చేసే అవకాశం ఉంది. డెస్క్‌టాప్ నుంచే నేరుగా స్టేటస్ అప్‌డేట్‌లు ఫోటోలను మరియు టెక్స్ట్‌ను షేర్ చేయవచ్చు.
ఫలితంగా స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకున్నా నేరుగా లింక్ చేసిన డివైజ్ నుంచి స్టేటస్ పోస్టులు చేసేందుకు అవకాశం ఉంది. వినియోగదారులకు ఈ ఫీచర్ అనుకూలంగా ఉంటుంది. మొబైల్ మరియు డెస్క్‌టాప్ నుంచి వాట్సాప్ కీలక ఫీచర్‌లను వినియోగించే అవకాశం ఉన్నట్లయింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
** వాట్సా్ప్ ఇటీవల కీలక నివేదికను (Whatsapp April 2024 Report) విడుదల చేసింది. 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 30 వరకు ఏకంగా 71 లక్షల అకౌంట్లపై నిషేధం విధించినట్లు తెలిపింది. భారత్ ఐటీ చట్టం 2021 నిబంధలను ఉల్లంఘించిన ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది.
వాట్సాప్ యూజర్లు తన ఫిర్యాదులను మెయిల్ ద్వారా పంపవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రీవెన్స్ విభాగానికి వివిధ అంశాలపై 10,554 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. దీంతోపాటు రిపోర్టు ఫీచర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు సహా ఇతర పర్యవేక్షణ విభాగాల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఏప్రిల్ నెలలో 7,182,000 భారతీయ వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపింది. ఇందులో 1,302,000 ఖాతాలను యూజర్ల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండా ముందస్తుగా నిషేధం విధించినట్లు పేర్కొంది. ఆన్ లైన్ భద్రత పర్యవేక్షణకు వాట్సాప్‌కు నిపుణులతో ప్రత్యేక వ్యవస్థ ఉంది.
యాప్‌లోనే యూజర్లు.. ఇతరుల ఖాతాలను బ్లాక్ చేయడం మరియు వాటిపై రిపోర్టు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. వాట్సాప్ వినియోగదారుల ఫిర్యాదులు సహా ఇతర ఫీడ్‌బ్యాక్‌పై వెంటనే సాయం చేసేలా ప్రత్యక వ్యవస్థ ఉంటుంది. దీంతోపాటు సైబర్ సెక్యూరిటీ సహా నకిలీ వార్తల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థలకు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








