Just In
- 14 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 16 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 20 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
WhatsApp మరో కొత్త ఫీచర్!! చాట్ బ్యాకప్‌లను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయడానికి అనుమతి
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రస్తుత కాలంలో తెలియని వారు ఉండరు. వాట్సాప్ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇప్పుడు కూడా మరొక కొత్త ఫీచర్ మీద పనిచేస్తున్నది. ఆండ్రాయిడ్ యూజర్‌లు తమ చాట్ బ్యాకప్‌లను అప్లికేషన్ నుండి స్టోర్ చేయడానికి వీలుగా వాట్సాప్ కొత్త ఫీచర్ పై పని చేస్తోంది. అయితే ఈ చాట్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్ లో మాత్రమే స్టోర్ చేయబడదు. కానీ వినియోగదారులు దీన్ని ఇంటర్నల్ స్టోరేజ్ కి ఎక్సపోర్ట్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వినియోగదారులు తమ చాట్‌ను గూగుల్ డ్రైవ్ వెలుపల బ్యాకప్ చేసుకోవడానికి అనుమతిస్తుంది అని కొత్త నివేదిక సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అప్లికేషన్‌లో పరీక్షించబడుతున్న తాజా ఫీచర్‌లలో ఒకటైన 'చాట్ బ్యాకప్ మెను' కొత్త ఎంపికను ప్రముఖ ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo గుర్తించినట్లు పేర్కొంది. వీరు ఈ కొత్త ఫీచర్‌కి సంబందించిన స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నారు. ఈ ఫీచర్ బీటా టెస్టర్‌లకు మాత్రమే కాకుండా అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని గమనించడం ముఖ్యం. వాట్సాప్ ఈ ఫీచర్‌ని పూర్తిగా ట్రాష్ చేసే లేదా వేరే విధంగా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు తమ చాట్‌లను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. మీరు ప్రాథమిక పరికరంలో మీ ఖాతాకు లాగిన్ చేసిన ప్రతిసారీ, మీరు మీ గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేయబడిన తాజా బ్యాకప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాకప్‌పై వినియోగదారులకు ఎటువంటి నియంత్రణ ఉండదు. కొత్త ఫీచర్ రాకతో వినియోగదారులు వాట్సాప్ చాట్ బ్యాకప్‌లను వారి స్థానిక ఇంటర్నల్ స్టోరేజ్ లేదా ఏదైనా ఇతర క్లౌడ్ స్టోరేజ్‌లో స్టోర్ చేయగలరు. ఈ బ్యాకప్‌లలో మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు మరియు ఇతర ఫైల్‌లను కలిగి ఉన్న మీ మొత్తం చాట్ డేటాను కలిగి ఉంటాయి. వినియోగదారులు తమ యొక్క చాట్‌ను బ్యాకప్ డౌన్‌లోడ్ చేయగలరు మరియు దానిని తిరిగి గూగుల్ డ్రైవ్‌లో ఉంచగలరు కూడా. ఇది వినియోగదారులకు వారి స్వంత డేటాపై మరింత నియంత్రణను అందిస్తుంది. అంతేకాకుండా వారు కోరుకున్న ప్రదేశంలో స్టోర్ చేసుకునే ఎంపికను కూడా అందిస్తుంది.

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ నుండి iOSకి మరియు వైస్-వెర్సా చాట్ బదిలీ ఫీచర్‌కి పూర్వగామి కావచ్చు. వాట్సాప్ వినియోగదారులు స్థానిక స్టోరేజ్ లో వారి చాట్ బ్యాకప్‌ని డౌన్‌లోడ్ చేసి ఆ పరికరంలో అవసరమైన మొత్తం డేటాను పొందడానికి అదే ఫైల్‌ను iOS పరికరానికి బదిలీ చేసే కొత్త పద్ధతిని కూడా వాట్సాప్ ప్రయత్నించవచ్చు. అయితే దీనికి సంబందించి ఇంకా నిర్ధారణ లేదు. అయితే ఇది త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి రావచ్చు. అప్పుడే మేము ఈ ఫీచర్ యొక్క ఉపయోగంకు సంబంధించి పూర్తి స్థాయిని అంచనా వేయగలుగుతాము.

డబుల్ వెరిఫికేషన్ కోడ్ ఫీచర్
WABetaInfo యొక్క నివేదిక ప్రకారం మీరు మీ యొక్క పాత స్మార్ట్‌ఫోన్ నుండి కొత్త ఫోన్ లో మీ వాట్సాప్ అకౌంటుతో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "డబుల్ వెరిఫికేషన్ కోడ్" ఫీచర్ ధృవీకరణ కోడ్ యొక్క మరొక దశను చూపుతుంది. ఈ నివేదిక ప్రకారం వాట్సాప్ అకౌంటులోకి లాగిన్ చేయడానికి మొదటి ప్రయత్నం విజయవంతమయినప్పటికీ కూడా మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరో ఆరు అంకెల కోడ్ అవసరం. ఎవరైనా వాట్సాప్ లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఫోన్ నంబర్ కి మరొక అదనపు మెసేజ్ పంపబడుతుంది. "ఇప్పటికే మరో ఫోన్‌లో వాట్సాప్ కోసం మీ యొక్క ఈ +********** నంబర్ ఉపయోగించబడుతోంది. మీ అకౌంట్ మీ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవడంలో సహాయం చేయడానికి మీరు తప్పనిసరిగా మరొక ధృవీకరణ కోడ్‌ను నిర్ధారించాలి. అదనపు భద్రత కోసం మీరు కోడ్‌ను పంపడానికి ముందు టైమర్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. మీరు కోడ్‌ని స్వీకరించిన తరువాత దానిని ఇక్కడ నమోదు చేయండి." అనే మెసేజ్ తో కూడిన స్క్రీన్‌షాట్ ని WABetaInfo తన యొక్క లీక్ లో పోస్ట్ చేసింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470