WhatsApp నుంచి మరొక మల్టీ ఫీచర్!! టెస్టింగ్‌లో కంపానియన్ మోడ్..

|

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు. తమకు ఇష్టమైన వారికి త్వరగా మెసేజ్లను పంపడమే కాకుండా వాయిస్ మరియు వీడియో కాల్స్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ యొక్క బీటా వినియోగదారులకు బహుళ ఫోన్లలో కంపానియన్ మోడ్ ఫీచర్‌ను తీసుకోనిరావడానికి పరీక్షిస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అది వారి మొదటి ఫోన్‌కు వాట్సాప్‌తో అనుబంధంగా రెండవ పరికరాన్ని జోడించడానికి అనుమతిస్తుంది.

కొత్త అప్‌డేట్‌

ఈ కొత్త అప్‌డేట్‌తో వినియోగదారులు వేర్వేరు స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లలో ఒకే ఇన్‌స్టంట్ మెసేజింగ్ అకౌంటును యాక్సెస్ చేయవచ్చు. అంతకుముందు వాట్సాప్ వారి ఫోన్‌లో ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా కూడా యాప్‌లో మెసేజ్లను పంపడానికి మరియు స్వీకరించడానికి ఒకేసారి బహుళ పరికరాల్లో వారి అకౌంటులను యాక్సెస్ చేయడానికి వినియోగదారులందరికీ మల్టీ-డివైస్ మద్దతును ప్రారంభించింది. అయినప్పటికీ ఈ ఫీచర్ ప్రస్తుతం PCలను రెండవ పరికరాలుగా మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే అదనపు మొబైల్ ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు ఉన్న వ్యక్తులకు ఇది లాభం చేకూర్చేది కాదు. కంపానియన్ మోడ్ విడుదలతో ఈ సమస్యలకు త్వరలోనే చెక్ పెట్టే అవకాశం ఉంది.

వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్

వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ WABetaInfo యొక్క నివేదిక ప్రకారం వాట్సాప్ యొక్క రెండవ రిజిస్టర్డ్ అకౌంటుకు రెండవ పరికరాన్ని లింక్ చేయడానికి అనుమతించే కంపానియన్ మోడ్‌ను అందుబాటులోకి తీసుకొనిరావడానికి పని చేస్తోంది. ఆండ్రాయిడ్ v2.22.10.13 బీటాతో ఈ ఫీచర్ మొదట ఏప్రిల్ చివరిలో గుర్తించబడింది. కానీ ఇప్పుడు ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందనే దాని గురించి మరిన్ని వివరాలు తెలియాలసి ఉంది.

స్క్రీన్‌షాట్‌
 

రిపోర్ట్‌లోని సమాచారం ప్రకారం వినియోగదారులు తమ ప్రధాన అకౌంటుకు సహచరుడిగా మరొక డివైస్ లో నమోదు చేసుకునేందుకు ఫుల్-స్క్రీన్ ప్రాంప్ట్ హెచ్చరికను చూపే స్క్రీన్‌షాట్‌ని కలిగి ఉంటుంది. మీరు సెకండరీ డివైజ్‌ని మరొక రిజిస్టర్డ్ వాట్సాప్ అకౌంటుకు జత చేస్తున్నప్పుడు సెకండరీ ఫోన్‌లో కాన్ఫిగర్ చేయబడిన ప్రస్తుత వాట్సాప్ అకౌంట్ నుండి మీరు లాగ్ అవుట్ చేయబడతారు అని స్క్రీన్‌షాట్ చెబుతోంది. వాట్సాప్ కంపానియన్ మోడ్‌కి మారడం వలన స్థానికంగా స్టోర్ చేయబడిన మెసేజ్లు మరియు డేటా తొలగించబడుతుంది. నివేదిక ప్రకారం ఒకే వాట్సాప్ అకౌంటును వేర్వేరు ఫోన్‌లలో ఉపయోగించగల సామర్థ్యం iOS మరియు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రెండింటిలోనూ పరీక్షించబడుతోంది. అయితే ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని గమనించండి.

వాట్సాప్ రియాక్షన్స్ కొత్త ఫీచర్‌ని ఉపయోగించడం ఎలా?వాట్సాప్ రియాక్షన్స్ కొత్త ఫీచర్‌ని ఉపయోగించడం ఎలా?

మల్టీ-డివైస్ మద్దతు

వాట్సాప్ మార్చిలో వినియోగదారులందరికీ మల్టీ-డివైస్ మద్దతును ప్రకటించింది. మొదటి పరికరంలో ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ కూడా ల్యాప్‌టాప్‌లు లేదా PCలలో గరిష్టంగా నాలుగు డివైస్లలో వారి అకౌంటును కనెక్ట్ చేయడానికి ఈ అప్ డేట్ వినియోగదారులను అనుమతిస్తుంది. కంపెనీ చాట్‌లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా ప్రారంభించింది.

Best Mobiles in India

English summary
WhatsApp Working on Companion Mode For Multiple Smartphones Access

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X