వాట్సాప్‌లో త్వరలో మరో ఆకట్టుకొనే ఫీచర్... యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందంటే?
Whatsapp Features : మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వినియోగిస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం వాట్సాప్ అనేక ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ మెసేజింగ్ యాప్ ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పై పనిచేస్తోందని ఇటీవల కొన్ని లీక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఫీచర్లతో పోలిస్తే మరింత మెరుగైన ఫీచర్లు, అనుభూతిని అందించేందుకు ప్రయత్నం చేస్తోందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది.
ప్రత్యేకంగా లిస్ట్ :
వాట్సాప్ లో కొత్త ఫీచర్ గురించి తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ఈ వివరాలను షేర్ చేసింది. స్టేటస్ అప్‌డేట్స్ లో ఎవరికి కనిపించాలనే అంశంపై ప్రత్యేకంగా జాబితా క్రియేట్ (Custom Lists) చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

యూజర్లకు ఎలా ఉపయోగపడుతుంది? :
ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. భవిష్యత్ లో వచ్చే అప్‌డేట్స్ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. యూజర్లకు ఎలా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్ లో మూడు రకాల ఆప్షన్ లు ఉన్నాయి. ఏదైనా స్టేటస్ క్రియేట్ చేస్తున్నట్లు సమయంలో, ఆ స్టేటస్ ఎవరికి కనిపించాలనే అంశంపై ఈ ఆప్షన్ లు ఉన్నాయి. ఇందులో My Contacts, My Contacts Except, Only Share with అనే మూడింటిలో మీకు కావాల్సింది ఎంచుకోవాల్సి ఉంటుంది.
వారి కోసం ప్రత్యేకంగా :
అయితే ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలుస్తున్న Custom lists ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లకు నచ్చినట్లుగా వివిధ లిస్ట్ లను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే కుటుంబం సభ్యుల కోసం, సహోద్యోగుల కోసం, ఫ్రెండ్స్ కోసం ఇలా అనేక లిస్ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.
పేర్లు మార్చుకోవచ్చు.. :
ఆయా లిస్ట్‌లలో మీకు నచ్చిన కాంటాక్ట్‌లను చేర్చుకోవచ్చు. ఫలితంగా యూజర్ స్టేటస్ క్రియేట్ చేసే సమయంలో ఈ లిస్ట్‌లను ఎంచుకోవచ్చు. ఈ లిస్ట్‌లకు ఎమోజీలను కూడా జతచేసుకోవచ్చు. అయితే ఈ లిస్ట్ పేర్లు, అందులోకి కాంటాక్ట్‌లు, ఎమోజీలను ఎన్ని సార్లు అయినా మార్చుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా! :
ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి రానుందనే వివరాలు వెల్లడి కాలేదు. వాట్సాప్ త్వరలో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొస్తుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రీమియం స్టిక్కర్లు, యాప్ థీమ్ లు, మూడు కంటే ఎక్కువ చాట్ లను పిన్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ కూడా అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ అందించిన వివరాల ఆధారంగా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను వెయిట్‌లిస్ట్ తరహాలో యాక్సెస్ అందించాలని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








