మరో 3 కొత్త ఫీచర్లను పరిచయం చేయబోతున్న వాట్సాప్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం తాజాగా మరో మూడు సరికొత్త ఫీచర్‌లను తీసుకొని రాబోతుంది. ఈ నేపధ్యంలో వాట్సాప్ లో రాబోతున్న ఆ కొత్త ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

డిస్కనెక్ట్ కాబోతోన్న 50 కోట్ల మొబైల్ నెంబర్స్డిస్కనెక్ట్ కాబోతోన్న 50 కోట్ల మొబైల్ నెంబర్స్

వెకేషన్ మోడ్

వెకేషన్ మోడ్

వాట్సాప్ లో ఉన్న సైలెంట్ మోడ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. సహజంగా ఏదైనా చాట్ కాన్వర్జేషన్‌ని ఆర్కైవ్ చేసినప్పుడు, కొత్తగా ఆ కాంటాక్ట్ నుండి ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే అది అన్-ఆర్కైవ్ చేయబడుతుంది కదా. అయితే వెకేషన్ మోడ్ అందుబాటులో వచ్చిన తర్వాత, మీకు మీరు స్వయంగా unmute, unarchive చేసేంతవరకు ఆయా ఛాట్ కన్వర్‌జేషన్లు అలాగే ఆర్కైవ్ చేయబడి ఉంటాయి.అంతేకాదు, ఒక నిర్దిష్టమైన ఛాట్ మీ ఛాట్ లిస్టులో పబ్లిక్ గా కనబడకుండా ఉండాలంటే కూడా ఈ వెకేషన్ మోడ్ పనికొస్తుంది. ఒకసారి మీరు వద్దనుకున్న ఛాట్‌ని mute చేసి, archive చేసినట్లయితే ఇకపై అది ఛాట్ లిస్టులో నేరుగా కన్పించదు. ప్రస్తుతానికి సదుపాయం డెవలప్మెంట్ దశలో ఉంది. త్వరలో అందుబాటులోకి వస్తుంది.

సైలెంట్ మోడ్

సైలెంట్ మోడ్

ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ వాడుతున్న వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చింది. మ్యూట్ చేయబడిన ఛాట్‌లకు app badgeని హైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది డిఫాల్ట్గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది. ఈ కారణం చేత ఇకపై మ్యూట్ చేయబడిన ఛాట్స్, గ్రూప్స్ నుండి మెసేజ్‌లు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి బ్యాడ్జ్ మనకు కనిపించదు.

లింక్డ్ అకౌంట్స్

లింక్డ్ అకౌంట్స్

వాట్సప్ అకౌంట్లను ఎక్స్టర్నల్ సర్వీస్లతో లింకు చేసే వెసులుబాటు కల్పిస్తుంది. ప్రత్యేకంగా ఇది వాట్సప్ బిజినెస్ వినియోగదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అందుబాటులోకి రాకపోయినప్పటికీ ప్రొఫైల్ సెట్టింగ్స్ విభాగంలో ఇది మనకు కనిపిస్తుంది.

Best Mobiles in India

English summary
WhatsApp working on linked accounts, vacation mode features.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X