Home
Apps

వాట్సాప్‌ స్టేటస్‌ బార్‌లో భారీ మార్పులు.. ఈ అప్‌డేట్‌ ఎలా ఉపయోగపడనుంది.. పూర్తి వివరాలు..!

ప్రముఖ మెసెజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ (Whatsapp) గత కొన్ని రోజులుగా వినియోగదారుల సౌకర్యం కోసం కీలక అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. తాజాగా వాట్సాప్ స్టేటస్‌ బార్‌లో భారీ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా స్టేటస్‌లో తమకు నచ్చిన కంటెంట్‌ను మరింత సౌకర్యంగా అప్‌డేట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WAbetainfo ఆధారంగా యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు మరిన్ని టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.7.16 లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందని తెలిపింది. ఈ వెర్షన్‌లో వాట్సాప్‌ స్టేటస్‌ కొత్త ఇంటర్‌ఫేస్‌ను గుర్తించవచ్చు.

Whatsapp working on status updates interface

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ఆధారంగా స్టేటస్‌ డిజైన్‌లో వేర్వేరు మీడియా ఫార్మాట్‌లకు సులభంగా మారవచ్చు. ప్రస్తుతం స్టేటస్‌ బార్‌ వాట్సాప్‌ దిగువన ఉంది. అందులో టెక్ట్స్‌, వీడియో, ఫోటోలను వేర్వేరుగా సెలక్ట్‌ చేసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం నేరుగా వాట్సాప్‌ స్టేటస్‌ బార్ నుంచి మీడియాను సెలక్ట్‌ చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో రానున్న అప్‌డేట్‌లలో విడుదల చేస్ అవకాశం ఉంది.

** వాట్సాప్‌ ఇటీవల మరో ఫీచర్‌పైన పనిచేస్తోందని ఫీచర్‌ ట్రాకర్‌ వెల్లడించింది. జనరేటివ్ AI ఫీచర్‌ ద్వారా ఫోటోలను ఎడిట్‌ చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ ద్వారా ఇమేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్పులు చేసేందుకు, రిస్టైల్‌ చేయడం సహా ఇతర మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ 2.24.7.13 వెర్షన్‌లో ఈ ఏఐ ఆధారిత ఇమేజ్‌ ఎడిటర్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. సాధారణంగా ఫోటోలను ఇతరులకు షేర్‌ చేసేటప్పుడు అధిక నాణ్యత కలిగిన ఫోటోలుగా పంపేందుకు HD ఆప్షన్‌ను ఎంచుకుంటాం. ప్రస్తుత ఫీచర్ ఆ HD బటన్‌ ఎడమవైపున ఉండనుంది. గ్రీన్‌ రంగు బటన్‌ను కలిగి ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయగానే బ్యాక్‌డ్రాప్‌, రీస్టైల్‌, Expand వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.

** దీంతోపాటు వాట్సాప్‌ ఇటీవల మరో ఫీచర్‌ను టెస్టింగ్‌ చేస్తున్నట్లు వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ వెల్లడించింది. ఈ ఫీచర్‌ వాయిస్‌ నోట్‌ను టెక్ట్స్‌ ఫార్మాట్‌లో మార్చుకొనేందుకు సాయం చేస్తుంది. వాయిస్‌ను ప్లే చేయకుండానే టెక్స్ట్‌లోకి మార్చుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సా్ప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WAbetainfo ఆధారంగా ఇటీవలే ఈ ఫీచర్‌ లాంచ్‌ చేసినట్లు తెలిసింది. ఆడియో నోట్‌ ప్లే చేయలేదని సమయాలు సహా ఇతర సందర్భాల్లో ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.7.8 ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఈ వెర్షన్‌ను వినియోగిస్తున్న వారు వాయిస్‌ నోట్‌ను టెక్ట్స్‌ రూపంలో మార్చుకోవచ్చు. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో భాగంగా వినియోగదారుల ప్రైవసీ కాపాడేందుకు డివైస్‌లోనే ట్రాన్‌స్క్రిప్ట్‌ను రూపొందించనుంది.

ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు సుమారు 150MB యాప్‌ డేటాను డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ కొన్నిసార్లు డిఫాల్ట్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. లేకుంటే వినియోగదారులు స్వయంగా ఆన్‌ (ఎనేబుల్‌) చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ సమయంలో వాయిస్‌ (Read Before You Listen) అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp working on status updates interface under android testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X