వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా, ఫన్నీగా మెసేజ్‌లు, ఫోటోలకు రియాక్ట్ కావచ్చు..!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా.. భారత్‌లోనే 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. భారీగా ఉన్న యూజర్ల సౌకర్యం, భద్రత, మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ కోసం అనేక కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా స్టిక్కర్ రియాక్షన్ ఫీచర్‌ను తీసుకురానుందని తెలుస్తోంది.
స్టిక్కర్ రియాక్షన్ ఫీచర్ :
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WEBetainfo ఈ కొత్త ఫీచర్ వివరాలను వెల్లడించింది. 2024 డిసెంబర్‌లోనే వాట్సాప్ ఎమోజీ రియాక్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల టెక్ట్స్ మెసేజ్‌లకు ఎమోజీల ద్వారా స్పందించవచ్చు. ప్రస్తుతం స్టిక్కర్ రియాక్షన్ ఫీచర్ పైన (Whatsapp Sticker Reaction Feature) పనిచేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉంది :
అయితే ఇప్పటికే ఇదే తరహా ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉంది. అయితే కేవలం iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో ఆండ్రాయిడ్, iOS యూజర్లకు ఈ ఫీచర్ త్వరలో విడుదల కానుంది.
ఈ ఎమోజీలతో సులభంగా మెసేజ్‌లకు స్పందించవచ్చని తెలుస్తోంది. ఫోటోలు, వీడియోలపై స్పందించేందుకు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. వాట్సాప్ అధికారిక స్టిక్కర్ స్టోర్ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ నుంచి వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు మరింత మెరుగైన అనుభూతి పొందుతారని తెలుస్తోంది.
WhatsApp news of the week: Android update to react to messages using stickers is under development!
— WABetaInfo (@WABetaInfo) April 26, 2025
This weekly summary can help you catch up on our 8 stories about WhatsApp beta for Android, iOS, and Desktop!https://t.co/L82nyBdMdd pic.twitter.com/5PXmMl6AaW
ఇటీవలే కొత్త ప్రైవసీ ఫీచర్‌లు :
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఆండ్రాయిడ్, iOS యూజర్ల కు అందుబాటులోకి రానుంది. అయితే కచ్చితంగా ఎప్పటి నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుందో తెలియాల్సి ఉంది. ఇటీవలే వాట్సాప్ అడ్వాన్సడ్ చాట్ ప్రైవరీ ఫీచర్‌ను లాంచ్ చేసింది.
ఈ ఫీచర్ ప్రస్తుతం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలో అందరికీ విడుదల కానుందని తెలుస్తోంది. ప్రైవసీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకున్నాక.. మీ ఛాట్‌ను ఇతరులు ఎక్స్‌పోర్టు చేసుకొనేందుకు అవకాశం ఉండదు.
దీంతోపాటు మీరు ఇతరులకు షేర్ చేసే ఫోటోలు, వీడియోలను అవతలి యూజర్లు సేవ్ చేయలేరు. ఫలితంగా మీ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ముఖ్యంగా ప్రైవేట్ చాట్స్ సమయంలో ఈ రెండు ఫీచర్లు బాగా ఉపయోగపడతాయి.
దీంతోపాటు వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ కీలక వివరాలను వెల్లడించింది. వాట్సా్ప్ స్టేటస్‌లో ప్రస్తుతం 60 సెకన్ల వరకు వీడియోను అప్‌లోడ్ చేయవచ్చు. త్వరలో ఈ సమయం మరింత పెరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ పైన వాట్సాప్ పనిచేస్తోందని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ అప్‌డేట్ అందుబాటులోకి వస్తే గరిష్ఠంగా 90 సెకన్ల వరకు వాట్సాప్ వీడియో స్టేటస్‌ను పెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని తెలుస్తోంది. కరోనా కంటే ముందు వాట్సాప్ స్టేటస్ సమయం 60 సెకన్లుగా ఉండేది. కరోనా సమయంలో 30 సెకన్లకు కుదించారు. గత సంవత్సరం 60 సెకన్లకు మళ్లీ పొడిగించారు.


Click it and Unblock the Notifications








