వాట్సాప్ స్టేటస్ లవర్స్ కోసం సూపర్ ఫీచర్.. 90 సెకన్ల వరకు స్టేటస్ పెట్టుకోవచ్చు..!!
వాట్సాప్ ను భారత్ లో సుమారు 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. భారీ సంఖ్యలో ఉన్న యాజర్ల కోసం కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్‌లో ఇతరులకు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను అవతలి వ్యక్తులు సేవ్ చేయకుండా ఉండేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ఇటీవల వెల్లడించింది. దీంతోపాటు వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్‌లలోనూ మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
వాట్సాప్ వాయిస్ కాల్ లో జాయిన్ అయ్యే కంటే ముందే మైక్‌ను మ్యూట్ చేసేందుకు అవకాశం కల్పించనుంది. ఈ ఫీచర్ అభివద్ధి దశలో ఉన్నట్లు తెలిసింది. దీంతోపాటు వాట్సాప్ వీడియో కాల్‌లో జాయిన్ అయ్యే కంటే ముందే కెమెరాను మ్యూట్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

అయితే తాజాగా వాట్సాప్ మరో సూపర్ ఫీచర్ ను (Whatsapp Status) అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయం కంటే ముందే వాట్సాప్ స్టేటస్ సమయం 60 సెకన్‌లుగా ఉండేది. అయితే కరోనా సమయంలో నకిలీ ప్రచారం సహా ఇతర కారణాలతో 30 సెకన్ల వరకే వాట్సాప్ స్టేటస్‌ను పరిమితం చేశారు. అనంతరం ఇటీవల కాలంలో 60 సెకన్ల వరకు పొడిగించారు.
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వాట్సాప్ స్టేటస్ వీడియోను 90 సెకన్ల వరకు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. మరికొన్ని వారాల్లో ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.12.9 లో వాట్సాప్ స్టేటస్ పొడిగింపు ఫీచర్ అందుబాటులో ఉంది. దీని వల్ల వాట్సాప్ స్టేటస్ లవర్స్ కు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ వివరాలు వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది.
ఈ ఫీచర్ కారణంగా వాట్సాప్ వినియోగించే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ మెసేజింగ్ ప్లా్ట్‌ఫాం మరింత ఆకట్టుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ప్రత్యేక యాక్సెస్ ఉన్న టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని సమాచారం. అయితే యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో తెలియలేదు.
అయితే వాట్సాప్‌లో ఇటీవలే అనేక అప్‌డేట్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టేటస్‌కు మ్యూజిక్ ట్రాక్ యాడ్ చేసుకొనే ఫీచర్ ఇప్పటికే యూజర్లకు విడుదల అయింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ బార్ నుంచి నచ్చిన మ్యూజిక్ ట్రాక్‌ను సెర్చ్ చేసుకొని యాడ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
దీంతోపాటు iOS యూజర్ల కూడా అనేక ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ నుంచే నేరుగా డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే ఏదైనా డాక్యుమెంట్‌ను థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా వాట్సాప్ నుంచే స్కాన్ చేసి, షేర్ చేయవచ్చు.
వాట్సాప్ iOS యూజర్లు వీడియో కాల్‌లో జూమ్ చేసుకొనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు కాల్ క్వాలిటీని అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపింది. దీంతోపాటు iOS యూజర్లు వాట్సాప్ ను తమ డిఫాల్ట్ కాలింగ్, మేసేజింగ్ యాప్‌గా మార్పుకొనేందుకు అవకాశం ఉంది.
వాట్సాప్ గ్రూప్‌లో ఎంత మంది యూజర్లు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉన్నారో తెలుసుకోవచ్చు. కొత్తగా వచ్చిన ఫీచర్ ద్వారా అన్‌లైన్‌లో ఎంత మంది ఉన్నారో నంబర్ రూపంలో కనిపిస్తుంది. గ్రూప్ పేరు కింద ఈ వివరాలను తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








