వాట్సాప్ యూజర్లకు డేంజర్ అలర్ట్.. లింక్ క్లిక్ చేయకపోయినా ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్!
WhatsApp: వాట్సాప్ యూజర్లకు ఓ బ్యాడ్‌న్యూస్. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని వాట్సాప్ సంస్థనే స్వయంగా హెచ్చరించింది. ఇక్కడ షాకింగ్ విషయమేమిటంటే, హ్యాకర్లు మీ ఫోన్‌లోకి చొరబడటానికి మీరు ఎలాంటి లింక్‌ను క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీన్నే "జీరో-క్లిక్" హ్యాకింగ్ అంటారు. అంటే, యూజర్ ఏమీ చేయకుండానే హ్యాకింగ్ జరిగిపోతుంది. వాట్సాప్ ప్రకారం, దాదాపు 90 మంది యూజర్లే టార్గెట్‌గా ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరిగింది.
బాధితుల్లో జర్నలిస్టులు, సాధారణ ప్రజలు, ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్‌కు చెందిన పారగాన్ సొల్యూషన్స్ అనే కంపెనీ తయారు చేసిన స్పైవేర్ ఉందని తేలింది. ఈ కంపెనీ హ్యాకింగ్ టూల్స్ తయారు చేయడంలో పేరుమోసింది.

* క్లిక్ చేయకుండానే ఫోన్లు హ్యాక్ సాధ్యమా
సాధారణంగా హ్యాకింగ్ అంటే ఏదో లింక్ క్లిక్ చేస్తేనో, ఏదైనా డౌన్‌లోడ్ చేస్తేనో జరుగుతుంది అనుకుంటాం. కానీ ఈసారి అలా కాదు. హ్యాకర్లు ఒక కొత్త టెక్నిక్ వాడారు. బాధితులు ఏమీ చేయకుండానే, రిమోట్‌గా ఫోన్‌లోకి ఎంటర్ అయిపోయారు. వాట్సాప్ చెప్పిన ప్రకారం, హ్యాకర్లు బాధితులకు కొన్ని "మాలిషియస్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్" పంపించారు.
ఈ డాక్యుమెంట్స్ యూజర్లు ఓపెన్ చేయకపోయినా, వాటితో ఇంటరాక్ట్ అవ్వకపోయినా చాలు... ఆటోమేటిక్‌గా ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఇదే అసలు ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే, చాలామందికి తమ ఫోన్ హ్యాక్ అయిందని కూడా తెలియదు. ఈ హ్యాకర్లు 24 కంటే ఎక్కువ దేశాల్లోని ప్రజలను టార్గెట్ చేశారు..
ముఖ్యంగా యూరప్‌లో ఉన్న జర్నలిస్టులు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు బాధితులుగా ఉన్నారు. పారగాన్ సొల్యూషన్స్ తయారు చేసే స్పైవేర్‌ను గవర్నమెంట్ ఏజెన్సీలు మాత్రమే వాడాలి. కానీ, ఈ టెక్నాలజీని ఎవరు మిస్‌యూజ్ చేశారో, అనుమతి లేకుండా ప్రజల ఫోన్లను ఎలా హ్యాక్ చేశారో అనేది మిస్టరీగా ఉంది.
పారగాన్ కంపెనీ ప్రమేయం ఉందని వాట్సాప్ ఎలా కన్ఫర్మ్ చేసిందో కూడా చెప్పలేదు. వాట్సాప్ ఈ విషయంపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌కు రిపోర్ట్ చేసింది కానీ, ఎక్కువ డీటెయిల్స్ బయటపెట్టలేదు. భవిష్యత్తులో ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి మరింత కట్టుదిట్టమైన సెక్యూరిటీ తీసుకురావచ్చు.
* పెరుగుతున్న స్పైవేర్ ముప్పు
ఇలాంటి దాడులు "యూజర్ ఇంటరాక్షన్" అవసరం లేని స్పైవేర్ల ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిటిజన్ ల్యాబ్ అనే సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ గ్రూప్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఇలాంటి స్పైవేర్ ముప్పు ఇంకా పెరుగుతూనే ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వాచ్‌డాగ్స్ ఈ బెదిరింపులను కనిపెడుతూనే ఉన్నా, రిస్క్ మాత్రం తగ్గట్లేదు.
వాట్సాప్ వార్నింగ్ యూజర్లందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ఈ హ్యాకింగ్‌కు యూజర్లేమీ చేయక్కర్లేదు కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండటం, తెలియని మెసేజ్‌లు, డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం వంటివి సెక్యూరిటీ రిస్క్‌లను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.


Click it and Unblock the Notifications








