Home
Apps

వాట్సప్ లేటెస్ట్ అనౌన్స్‌మెంట్, తెలుగులో తొలిసారిగా..

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌ యాప్‌ దిగ్గజం వాట్సప్‌ తెలుగు ప్రజలకు తొలిసారిగా తెలుగులో హెచ్చరికలను జారీ చేసింది.

By Hazarath Aiah

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌ యాప్‌ దిగ్గజం వాట్సప్‌ తెలుగు ప్రజలకు తొలిసారిగా తెలుగులో హెచ్చరికలను జారీ చేసింది. ఇటీవలి కాలంలో తప్పుడు సందేశాలు, పుకార్లు వాట్సప్‌ గ్రూపుల్లో విపరీతంగా షేర్‌ కావడం, అనంతరం జరుగుతున్న అమానుష దాడుల ఈ నేపథ్యంలో వాట్సప్‌ ఈ ప్రకటనను విడుదల చేసింది. యూజర్లు అందుకున్న సమాచారం నిజమైనదా, నకిలీదా నిర్ధారించుకోవడానికి సంబంధించి 10 చిట్కాలను ఈ ప్రకటనలో సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకుచెందిన వార్తాపత్రికల్లో ప్రత్యేకంగా తెలుగులో ఫుల్‌ పేజీ ప్రకటన జారీ చేసింది. ఉభయ తెలుగు రాష్టా‍ల్లో ప్రజలపై దాడులు, మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తప్పుడు సమాచారం, అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఓ సారి చూద్దాం.

ఫార్వార్డ్ సందేశాన్ని అర్థం చేసుకోవడం

ఫార్వార్డ్ సందేశాన్ని అర్థం చేసుకోవడం

మీరు పంపే సందేశం ఎవరో రాశారో తెలియకుంటే దాన్ని ఒకటికి రెండు సార్లు చదవాలని తెలిపింది.

నమ్మశక్యం కాని సమాచారం.

నమ్మశక్యం కాని సమాచారం.

నమ్మడానికి వీలు లేని కథనాల్లో నిజాలను గ్రహించండి. అసత్యవార్తలను షేర్ చేసి మోసపోకండి.

ఫోటోలపై జాగ్రత్త

ఫోటోలపై జాగ్రత్త

మీరే షేర్ చేసే ఫోటోల్లో అలాగే అందులోని కంటెంట్ నిజ నిర్థారణ చేసుకున్న తరువాతే దానిపై స్పందించండి.

ఇతర మూలాలు

ఇతర మూలాలు

మీరు పంపే కంటెంట్ ఇతర సైట్లలో కాని లేక న్యూస్ ఛానల్స్ లో కాని వచ్చిందా లేదా అని నిర్ధారణ చేసుకోండి.

నియంత్రణ

నియంత్రణ

మీ వాట్సప్ లో మీకు నచ్చని వారిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి వార్తలను పంపుతున్న వారిని వెంటనే బ్లాక్ చేయండి.

సమాచారాన్ని ప్రశ్నించండి

సమాచారాన్ని ప్రశ్నించండి

ఎవరైనా ఇతరులను టార్గెట్ చేస్తూ పంపించినప్పుడు దాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి షేర్ చేయండి.

భిన్న సందేశాలు

భిన్న సందేశాలు

మీరు పంపే సందేశాల్లో అక్షరదోషాలు లాంటివి ఉండవచ్చు. కాబట్టి వీలైనంతవరకు వాటిని గుర్తించడం చాలావరకు మేలు

లింకుల తనిఖీ

లింకుల తనిఖీ

మీరు వెబ్ సైట్ లింకులు ఓపెన్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సార్లు మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

అవగాహన

అవగాహన

మీరు ఇతరులకు పంపే పోస్టు మీద అవగాహన ఉంటే పంపించండి. వారి దాని గురించి అడిగితే మీరు జవాబివ్వగలిగే సామర్ధ్యం ఉండాలి.

నకిలీ వార్తలు

నకిలీ వార్తలు

ఓ సందేశమే మనకు ఎన్నో సార్లు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం పంపిన సందేశమే వేరొకరి ద్వారా మనకు వస్తుంది. ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టండి

Best Mobiles in India

English summary
WhatsApp’s 10-point ad in Telugu to combat fake news: A first step More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X