వాట్సప్ నుంచి దిమ్మతిరిగే ఫీచర్, యూజర్లకి బెస్ట్ బెనిఫిట్

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది వాట్సప్ వైపు.. ఈ ఇన్ స్టంట్ మెసేజింగ్ దిగ్గజం ఊహించని విధంగా దూసుకుపోతోంది.

|

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది వాట్సప్ వైపు.. ఈ ఇన్ స్టంట్ మెసేజింగ్ దిగ్గజం ఊహించని విధంగా దూసుకుపోతోంది. పొద్దునలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలామంది వాట్సప్ వాట్సప్ అంటూ కలవరిస్తున్నారంటే అతిశయోక్తికాదు. ఇక దీంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా ఒక్కోసారి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు తెలియకుండానే ఇతర గ్రూపుల్లో యాడ్ చేస్తుంటారు చాలామంది. ఆగ్రూపు ఎవరిదో మనకు తెలియదు అందులో ఏముంటాయో మనకు తెలియదు. అయినా యాడ్ చేయడంతో తలనొప్పి వస్తుంది. దాన్నుంచి రిమూవ్ అయినా మరో గ్రూపులోకి యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యకు ఇప్పుడు వాట్సప్ చక్కని పరిష్కారం చూపబోతోంది.

 

రూ.11కే జియో అన్-లిమిటెడ్ 4జీ డేటారూ.11కే జియో అన్-లిమిటెడ్ 4జీ డేటా

కొత్త ఫీచర్

కొత్త ఫీచర్

వాట్సప్ ఇప్పుడు కొత్త ఫీచర్ మీద పనిచేస్తోంది. WaBetaInfo అందించిన రిపోర్ట్ ప్రకారం వాట్సప్ అడ్మిన్లు ఎవరైనా యూజర్లను గ్రూపుల్లో యాడ్ చేయాలనుకుంటే ముందుగా వారి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఒకే అంటేనే గ్రూపులో యాడ్ చేయాల్సి ఉంటుంది.

ఇన్విటేషన్

ఇన్విటేషన్

వాట్సప్ యాడ్ గ్రూపు ఇన్విటేషన్ ను రెడీ చేస్తుందని రిపోర్ట్ తెలియజేస్తోంది. ఈ ఫీచర్ అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా ఐఓఎస్ బీటా ఫీచర్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సప్ బిజినెస్ ను పెంచుకునేందుకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని కంపెనీ విశ్వసిస్తోంది.

అనుమతి లేకుండా గ్రూపుల్లో
 

అనుమతి లేకుండా గ్రూపుల్లో

రిపోర్ట్ ప్రకారం యూజర్ అనుమతి లేకుండా గ్రూపుల్లో ఎవరూ యాడ్ చేయలేరు. ఒకవేళ యాడ్ చేసినా ముందుగా యూజర్ కి అలర్ట్ మెసేజ్ వెళుతుంది. ఆ అలర్ట్ మెసేజ్ ద్వారా యూజర్ గ్రూపులోకి యాడ్ కావాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఫీచర్ 72 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఇది డిలీట్ అవుతుంది. మళ్లీ రిక్వెస్ట్ పెట్టినప్పుడు కూడా ఇలానే ఉంటుంది.

మూడు రకాల ఆప్సన్లు

మూడు రకాల ఆప్సన్లు

ఈ ఫీచర్ మీరు చూడాలంటే WhatsApp Settings> Account>Privacy> Groups>Who can add me to groups చూడాల్సి ఉంటుంది. అందులో మూడు రకాల ఆప్సన్లు ఉంటాయి. Everyone, My contacts, and Nobody వీటిల్లో సెలక్ట్ చేసుకునే దాని బట్టి గ్రూపుల్లోకి మీరు ఎంటరయ్యే విధానం ఆధారపడి ఉంటుంది.

 

 

పనితీరు

పనితీరు

Everyone సెలక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇన్విటేషన్ రాదు. ఇక కాంటాక్ట్స్ సెలక్ట్ చేసుకుంటే మీ స్నేహితులు తప్ప ఎవరు యాడ్ గ్రూపుల్లో యాడ్ చేసినా మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇక మూడో ఆప్సన్ సెలక్ట్ చేసుకుంటే స్నేహితులతో పాటు ఎవరు యాడ్ చేసినా మీకు ఇన్విటేషన్ మెసేజ్ వస్తుంది. మీ ప్రమేయం లేకుండా ఎవరూ గ్రూపుల్లో యాడ్ చేయలేరు.

 

 

Best Mobiles in India

English summary
WhatsApp's big feature! Admins will soon have to seek permission before adding users to groups More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X