వాట్సప్‌లో డిలీట్ చేసిన మెసేజ్ చదవొచ్చు, ప్రయత్నించండి

By Hazarath
|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న వాట్సప్ రోజుకో ప్రత్యేక ఫీచర్‌తో యూజర్లను అలరిస్తున్నసంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ మధ్య Delete for Everyone అంటూ ఓ ఫీచర్ తీసుకొచ్చింది.అయితే ఈ ఫీచర్ ద్వారా డిలీట్ అయిన మెసేజ్‌లు కనిపిస్తాయా..అవి మళ్లీ చదవొచ్చా అనే విషయాలపై ఇప్పుడు తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అయితే ఓ బ్లాగ్ డిలీట్ అయిన వాటిని చూడచ్చు అని చెబుతోంది.

 

అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరో 5, ధర రూ. 17,999అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరో 5, ధర రూ. 17,999

మీ డివైస్ లో నోటీఫికేషన్ రూపంలో..

మీ డివైస్ లో నోటీఫికేషన్ రూపంలో..

డిలీట్ అయిన మెసేజ్ లు మీ డివైస్ లో నోటీఫికేషన్ రూపంలో వస్తాయంటూ స్పానిష్ ఆండ్రాయిడ్ బ్లాగ్ Android Jefe పేర్కోంది. మీరు డిలీట్ చేసిన తరువాత కూడా ఆ మెసేజ్ చదివే అవకాశం ఉందని ఆ బ్లాగ్ పేర్కొంది.

కొత్త ఫీచర్ ద్వారా..

కొత్త ఫీచర్ ద్వారా..

ఈ ఫీచర్ ఎలాంటి ఉపయోగం లేనిదని ఈ బ్లాగ్ స్పష్టం చేసింది. కొత్త ఫీచర్ ద్వారా మెస్సేజ్ రిసీవింగ్ నెటిజన్ సెండర్ పంపిన సందేశాలను తెలుసుకునే ఛాన్స్ ఉందని చెబుతోంది.

నోటిఫికేషన్ హిస్టరీ లాగ్..
 

నోటిఫికేషన్ హిస్టరీ లాగ్..

దీన్ని చదవాలంటే యూజర్ తమ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'నోటిఫికేషన్ హిస్టరీ లాగ్' అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ మన ఫోన్లో ఉంటే వాట్సప్‌లో మనకు పంపి, డిలీట్ చేసిన సందేశాలను చదవవచ్చు.

నోటిఫికేషన్స్ రూపంలో

నోటిఫికేషన్స్ రూపంలో

వాట్సప్‌లో పంపించే మెసేజ్‌లు నోటిఫికేషన్స్ రూపంలో అవతలి వ్యక్తి దృష్టికి తీసుకెళ్తాయి. అలా ఒక్కో మెసేజ్‌లోని తొలి 100 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ నోటిఫికేషన్ హిస్టరీ లో స్టోర్ అవుతాయి.

వాట్సప్ నోటిఫికేషన్స్ ని డిసేబుల్ చేయనంత వరకు..

వాట్సప్ నోటిఫికేషన్స్ ని డిసేబుల్ చేయనంత వరకు..

వాట్సప్ నోటిఫికేషన్స్ ని డిసేబుల్ చేయనంత వరకు ఈ విధంగా డిలీట్ చేసిన సమాచారాన్ని చదవే అవకాశం ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ 7.0, ఆ తర్వాత వచ్చిన అప్‌డేటెడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే మీకు ఇతరులు పంపి, డిలీట్ చేసిన సందేశాలు చూసుకోవచ్చు.

ఇద్దరూ యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న వారై ఉండాలి

ఇద్దరూ యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న వారై ఉండాలి

సెండర్, రిసీవర్ ఇద్దరూ యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న వారై ఉండాలని, ఒకరు మాత్రమే యాప్ అప్‌డేట్ చేసుకున్నా ప్రయోజనం ఉండదని వాట్సప్ కంపెనీ హెచ్చరించిన సంగతి అందరికీ తెలిసిందే.

Most Read Articles
Best Mobiles in India

English summary
Deleted a WhatsApp Message You Sent? Recipients Can Still Read It More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X