Home
Apps

వాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్, వారికి మాత్రమేనట

ఇన్ స్ట్ంట్ మేసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ రోజుకో కొత్త అప్‌డేట్‌తో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

By Hazarath Aiah

ఇన్ స్ట్ంట్ మేసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ రోజుకో కొత్త అప్‌డేట్‌తో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కొత్తగా తీసుకువచ్చిన వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌ను మరింత మందికి చేరువ చేసి, వ్యాపారాలకు ఉపయోగపడేందుకు అందులో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుంది. అదే 'ఛాట్‌ ఫిల్టర్స్‌' ఫీచర్‌. దీని ద్వారా వాట్సప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌ అడ్మిన్లు త్వరగా మెసేజ్‌లను సెర్చ్‌ చేసుకోవచ్చు. అవసరమైన కస్టమర్లను త్వరగా సెర్చ్‌ చేసుకునేందుకు వ్యాపారస్తులకు సాయం చేయాలని ఈ సోషల్‌ మీడియా దిగ్గజం నిర్ణయించింది. ఈ క్రమంలోనే 'ఛాట్‌ ఫిల్టర్స్‌' అనే ఫీచర్‌ను తన బిజినెస్‌ యాప్‌కు యాడ్‌ చేసింది.

ఫిల్టర్స్‌ను యాక్సస్‌ చేసుకోవడానికి..

ఫిల్టర్స్‌ను యాక్సస్‌ చేసుకోవడానికి..

ముందుగా మీరు ఈ ఫిల్టర్స్‌ను యాక్సస్‌ చేసుకోవడానికి సెర్చ్‌ బార్‌పై అడ్మిన్‌ ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఛాట్‌ ఫిల్టర్స్‌' ఫీచర్‌ యూజర్లను అన్‌రీడ్‌ ఛాట్స్‌, గ్రూప్స్‌, బ్రాడ్‌కాస్ట్‌ కేటగిరీల కింద గ్రూప్‌ చేయనుంది.

యాక్షన్‌ బటన్‌' మాదిరే ..

యాక్షన్‌ బటన్‌' మాదిరే ..

ఇది అచ్చం ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘యాక్షన్‌ బటన్‌' మాదిరే పనిచేస్తుంది. ఈ యాక్షన్‌ బటన్‌ కూడా ముఖ్యమైన కస్టమర్లను డైరెక్ట్‌గా ఇన్‌బాక్స్‌లోకి తీసుకొస్తుంది.

ఛాట్‌ ఫిల్టర్స్‌

ఛాట్‌ ఫిల్టర్స్‌

ప్రస్తుతం వాట్సప్‌ తీసుకొస్తున్న ‘ఛాట్‌ ఫిల్టర్స్‌' అనే ఫీచర్‌తో వ్యాపారాలను మెరుగ్గా చేసుకునే అవకాశముంటుంది. ముఖ్యమైన కస్టమర్లకు మంచి సేవలను అందించవచ్చు. వారి ప్రాధాన్యత బట్టి కమ్యూనికేషన్‌ను నిర్వహించవచ్చు.

చిన్న, మధ్య తరహా వ్యాపారులను..

చిన్న, మధ్య తరహా వ్యాపారులను..

వాట్సప్‌ ఫర్‌ బిజినెస్‌ అనే యాప్‌ను ఈ ఏడాది జనవరిలోనే లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. చిన్న, మధ్య తరహా వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని ఈ బిజినెస్ యాప్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నవారు ఈ బిజినెస్ యాప్ ద్వారా తమ వినియోగదారులతో టచ్‌లో ఉండొచ్చు.

 అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను..

అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను..

ఈ కొత్త యాప్‌ను పాత వాట్సప్ మెసెంజర్ ప్లాట్‌ఫాం మీద రూపొందించినప్పటికీ.. అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను జతచేశారు. వెరిఫైడ్ ప్రొఫైల్, క్విక్ రిప్లైస్, గ్రీటింగ్ మెసేజెస్, అవే మెసేజెస్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

వాట్సప్ మాదిరిగానే..

వాట్సప్ మాదిరిగానే..

వాట్సప్ మాదిరిగానే వాట్సప్ బిజినెస్ యాప్‌ను చూడా ఎంతో సెక్యూర్‌గా రూపొందించారు. మీ కాల్స్, మెసేజ్‌లు థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఈ యాప్‌లో పొందుపరిచారు.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp’s next big feature is for businesses to serve you better More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X