Home
Apps

వాట్సప్ అప్ కమింగ్ ఫీచర్ ఏంటో తెలుసా ?

By Gizbot Bureau

తప్పుడు సమాచారం, అసత్య వార్తలు వ్యాప్తి కాకుండా కట్టడి చేసేందుకు ప్రముఖ సోషల్‌ మేసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో వాట్సప్‌లో వస్తున్న వదంతుల వ్యాప్తి కారణంగా అమాయకులపై దాడులు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కూడా వాట్సప్‌ను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో తప్పుడు వార్తలను అరికట్టేందుకు వాట్సప్‌.. ఫార్వర్డ్‌ చేసే సందేశాలపై పరిమితి విధించింది. ఇందులో భాగంగానే ఇక నుంచి వాట్సప్‌ మెసేజ్‌లు ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు మరో కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. అదే వాట్సప్ ఫార్వార్డ్ ...

రెండు రకాల కొత్త ఫీచర్లు

రెండు రకాల కొత్త ఫీచర్లు

WABetaInfo ప్రకారం వాట్సప్ లో రెండు రకాల కొత్త ఫీచర్లు రానున్నాయి. అవే Forwarding Info' and 'Frequently Forwarded.Forwarding Info ఆప్సన్ మెసేస్ ఇన్ఫో సెక్షన్ లో ఉంటుంది. దీని ప్రకారం యూజర్లు ఆ మెసేజ్ ఎన్ని సార్లు ఫార్వార్డ్ అయిందో తెలుసుకునే వీలు ఉంటుంది.

సెండ్ మెసేజ్ కి మాత్రమే

సెండ్ మెసేజ్ కి మాత్రమే

కాగా WABetaInfo అందించిన సమాచారం ప్రకారం ఈ ఫీచర్ సెండ్ మెసేజ్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ మెసేజ్ ఎన్ని సార్లు ఫార్వార్డ్ అయిందో తెలుసుకుని దాని ద్వారా మీరు మెసేజ్ ఫేక్ లేక ఒరిజినల్ తెలుసుకునే వీలు ఉంటుంది.

Frequently Forwarded

Frequently Forwarded

మరొక ఫీచర్ Frequently Forwarded ను తీసుకొస్తోంది. ఇది నాలుగు సార్లు కన్నా ఎక్కువగా ఫార్వార్డ్ అయితే ఇది Frequently Forwarded అని చూపిస్తుంది. కాబట్టి ఇది 5 సార్లు కన్నా ఎక్కువ ఫార్వార్డ్ చేయడానికి వీలు పడదు.

త్వరలో వచ్చే అవకాశం

త్వరలో వచ్చే అవకాశం

అయితే ఈ ఫీచర్లు ఇంకా బీటా దశలోనే ఉన్నాయి. త్వరలో లైవులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఫార్వార్డ్ ఫీచర్ ను గతేడాది వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పాటు మరిన్ని ఫీచర్లను తీసుకువచ్చింది.

ఎన్నికల వేళ అడ్డుకట్టడి

ఎన్నికల వేళ అడ్డుకట్టడి

ఇండియాలో సార్వత్రిక సమరం మొదలు కానున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేక్ న్యూస్ పై యుద్దాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా ఫేక్ న్యూస్ ఎవరైనా ప్రమోట్ చేస్తే వారిపై చర్యలు తీసుకునేలా రూల్స్ ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
WhatsApp's 'upcoming' Forwarded messages plans to take on fake news More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X