Home
Apps

వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. "View Once" ఫీచర్‌లో పెద్ద లొసుగు.. ఈ విషయం తెలుసుకోకపోతే డేంజరే..!

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. అందులో "వ్యూ వన్స్" అనేది అత్యంత ఉపయోగకరమైన ఫీచర్. దీంట్లో ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు పంపితే అవతలి వాళ్లు ఒక్కసారి చూసిన తర్వాత వారి ఈ ఫోన్ నుంచి డిలీట్ అయిపోతాయి. అందుకే చాలామంది దీన్ని ఇష్టపడతారు. కానీ, ఈ ఫీచర్‌లో ఒక పెద్ద లొసుగు ఉంది. దీనితో మీ ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశముంది.

* "వ్యూ వన్స్" మీడియాలో అసలు సమస్య ఇదే
"వ్యూ వన్స్" ఫీచర్ ద్వారా ఎవరికైనా ఫోటోలు, వీడియోలు పంపిస్తే, వాళ్లు ఒక్కసారి చూడగానే అవి మాయం అయిపోతాయని వాట్సాప్ చెబుతోంది. కానీ, నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా నిజం కాదు, ఎందుకంటే ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తే, "వ్యూ వన్స్" మీడియాను చూసిన తర్వాత కూడా మళ్లీ చూడొచ్చు.

Whatsapp s  View Once  Isn t As Secure news

ప్రస్తుతం ఈ సమస్య ఐఫోన్లలో ఉంది. దీంతో ఈ ఫీచర్ అసలు ఉద్దేశమే దెబ్బతింటోంది. ప్రైవసీ ఉండాలని అనుకుంటే ఇది పెద్ద చిక్కు తెచ్చిపెడుతోంది. ఐఫోన్ యూజర్లు "వ్యూ వన్స్" మీడియాను చూసినా కూడా మళ్లీ ఎలా చూడొచ్చో చూద్దాం.

ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మేనేజ్ స్టోరేజ్‌పై నొక్కాలి. కిందకు స్క్రోల్ చేస్తే మీడియా పంపిన కాంటాక్ట్ పేరు కనిపిస్తుంది. ఆ పేరు మీద నొక్కి, 'సార్ట్ బై' అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో 'న్యూయెస్ట్ ఫస్ట్' సెలెక్ట్ చేయాలి.

అంతే, "వ్యూ వన్స్" మీడియా లిస్ట్‌లో కనిపిస్తుంది. మళ్లీ కావాలంటే చూడొచ్చు. ఈ లొసుగు వల్ల "వ్యూ వన్స్" ఫీచర్ ఉద్దేశమే వృథా అయిపోయింది. ఎందుకంటే సీక్రెట్ లేదా పర్సనల్ మీడియా అనుకున్నా, అవతలి వాళ్లకి తెలియకుండానే దాన్ని మళ్లీ చూడొచ్చు. ఒక్కసారి కంటే ఎక్కువసార్లు చూడొద్దు అనుకొని పంపినవారికి ఇది పెద్ద రిస్క్.

* ప్రైవసీకి పెద్ద రిస్క్
ఈ లొసుగు వల్ల యూజర్లకు చాలా డేంజర్. ముఖ్యంగా ఎవరైతే పర్సనల్ లేదా కాన్ఫిడెన్షియల్ కంటెంట్ షేర్ చేయడానికి "వ్యూ వన్స్" ఫీచర్‌ను నమ్ముతారో వాళ్లకు ఇది చాలా ప్రమాదకరం. మాయం అయిపోవాలి అనుకున్న మీడియా కూడా మళ్లీ చూడొచ్చు అంటే నిజంగా షాకింగ్ అని చెప్పవచ్చు.

* మెటా రియాక్షన్ ఇంకా యూజర్లకు సేఫ్టీ టిప్స్
వాట్సాప్ కంపెనీ అయిన మెటా త్వరలోనే ఈ సమస్యను ఫిక్స్ చేస్తుందని అంటున్నారు. కానీ, అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు యూజర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత, రహస్యమైన ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేయడానికి "వ్యూ వన్స్" ఫీచర్‌ను వాడకపోవడమే మంచిది.

* సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?
పర్సనల్ లేదా ఇంపార్టెంట్ కంటెంట్ కోసం "వ్యూ వన్స్" వాడొద్దు. వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటే మీకే మంచిది. ఈ ఫీచర్ వాడే ముందు రిస్క్‌లు ఏంటో తెలుసుకోవాలి. ఈ లొసుగు వల్ల ఆన్‌లైన్‌లో పర్సనల్ కంటెంట్ షేర్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తోంది.

వాట్సాప్ ఈ సమస్యను సాల్వ్ చేయడానికి పనిచేస్తున్నా యూజర్లు మాత్రం ప్రైవసీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కొంతమంది తెలియని వారికి ఈ ఫీచర్ ద్వారా ఒకసారి ఫొటో/వీడియో పంపితే ఏం కాదు అనుకుంటారు. స్క్రీన్‌షాట్ తీసుకోలేరు అనుకుంటారు కానీ అది నిజం కాదు కాబట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ విషయాన్ని తప్పకుండా షేర్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X