Home
Apps

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అంటే ఏమిటి.. మేడ్‌ ఇన్‌ ఇండియా యాప్‌ అరట్టై కు ఎందుకు ఈ సపోర్టు అవసరం?

వాట్సాప్‌ యాప్‌నకు పోటీగా జోహో కార్పొరేషన్ అరట్టై యాప్‌ను (Made in india Arattai App) తీసుకొచ్చింది. ఇటీవల ఒక్కసారిగా అరట్టై యాప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో గతంలో 3500 గా ఉన్న సైన్‌ అప్‌లు ఒక్కసారిగా 3,50,000 సైన్‌ అప్‌లకు చేరింది. మరియు ఆపిల్‌ స్టోర్‌ యాప్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్ విభాగంలో నంబర్‌ 1 గా నిలిచింది. ప్రస్తుతం కోటిగా పైగా డౌన్‌లోడ్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

ప్రధాని మంత్రి మోడీ స్వదేశీ ఉత్పత్తులు, యాప్‌లను ఉపయోగించాలనే పిలుపుతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌తో సహా ఇతర మంత్రులు ఈ యాప్‌ను ఉపయోగించాలని సోషల్‌ మీడియాలో పోస్టులు చేయడంతో ఒక్కసారిగా మేడ్‌ ఇండియా యాప్‌పై అందరి దృష్టి పడింది.

Why Made in india App Arattai needs End to End Encryption

వాట్సాప్‌ తరహాలో ఎన్నో ఫీచర్లు :
స్వదేశీ యాప్‌ అరట్టైలో వాట్సాప్‌ తరహాలో (Whatsapp) అనేక ఫీచర్లు ఉన్నాయి. అరట్టై అనేది తమిళ పదం. తెలుగులో మాట్లాడుకోవడం (Chit Chat) అని అర్థం. చాట్, వాయిస్‌, వీడియో కాల్స్‌, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌ షేరింగ్‌, స్టేటస్‌, ఛానళ్లు, పాకెట్‌ సహా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి

అయితే వాట్సాప్‌లో చాట్‌, వాయిస్, వీడియో కాల్స్‌కు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (E2E) సపోర్టు ఉంటుంది. అయితే అరట్టై యాప్‌లో మాత్రం వాయిస్‌, వీడియో కాల్స్‌ కు మాత్రమే ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టు ఉంది. త్వరలోనే చాట్‌కు కూడా ఈ సపోర్టు తీసుకొస్తామని, ప్రస్తుతం ఈ అంశాన్ని అధిక ప్రాధాన్యతతో పనిచేస్తున్నట్లు తెలిపింది.

ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అంటే :
ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అనేక అత్యంత ముఖ్యమైన ప్రైవసీ ఫీచర్. ఈ ఫీచర్‌ ఉంటే.. చాట్‌లో మెసేజ్‌ పంపే యూజర్‌, ఆ మెసేజ్‌ను పొందే యూజర్‌ మాత్రమే చూసేందుకు వీలుంటుంది. ఇతర వ్యక్తులు ఆ చాట్‌ను పొందలేరు. వాట్సాప్ విషయానికి వస్తే.. చాట్‌, కాల్స్‌కు ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టు ఉంది.

ఫలితంగా మెసేజ్‌ పంపిన యూజర్, పొందిన యూజర్ మాత్రమే వాటిని చూసేందుకు వీలుంటుంది. వాట్సాప్‌తోపాటు మాతృసంస్థ మెటా కూడా ఈ మెసేజ్‌లను చూడలేదు. ఫలితంగా ప్రైవసీ పరంగా యూజర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. ప్రస్తుతం వాట్సాప్‌, సిగ్నల్‌ వంటి యాప్‌లు పూర్తి స్థాయిలో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను సపోర్టును అందిస్తున్నాయి.

జోహో కార్పొరేషన్‌ అరట్టై యాప్‌ను 2021 లోనే లాంచ్‌ చేసింది. అయితే ఇటీవలే ఈ యాప్‌ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కాల్స్‌ కు మాత్రమే E2E సపోర్టు ఉంది. చాట్‌ కు కూడా ఈ సపోర్టు తీసుకొచ్చేందుకు జోహో సంస్థ ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అరట్టై యాప్‌నకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు :
వాట్సా్ప్ తన యూజర్ల డేటాను భారత్‌లో కాకుండా బయట స్టోరేజీ చేస్తోంది. ఫలితంగా ఏదైనా సందర్భంలో యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. మరియు ఇటీవల తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రేషన్‌ పై కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే అరట్టై విషయానికి వస్తే.. డేటాను పూర్తిగా భారత్‌లోనే స్టోరేజీ చేస్తుంది. మరియు యూజర్ల వివరాలను వాణిజ్య అవసరాల కోసం ఎవరితోనూ పంచుకోమని ఇప్పటికే సంస్థ స్పష్టం చేసింది.

జోహో కార్పొరేషన్‌ చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ యాప్‌, మెయిల్‌తోపాటు అనేక సర్వీసులు అందిస్తోంది. అనేక విభాగాల్లో 55 కు పైగా బిజినెస్‌ అప్లికేషన్‌లను కలిగి ఉంది. ఇప్పటికే అనేక దేశాల్లో సేవలు అందిస్తోంది. ఈ సంస్థను శ్రీధర్ వెంబు ప్రారంభించారు.

Best Mobiles in India

English summary
Why Made in india App Arattai needs End to End Encryption, what is the use of this feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X