Uber ఇండియాకి గుడ్ బై చెప్పనుందా, సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ !

దేశీయ క్యాబ్ సేవల్లో ఓలాతో పోటీ పోటీగా దూసుకుపోతున్న క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌ సేవలు ఇండియాలో నిలిచిపోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

By Hazarath
|

దేశీయ క్యాబ్ సేవల్లో ఓలాతో పోటీ పోటీగా దూసుకుపోతున్న క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌ సేవలు ఇండియాలో నిలిచిపోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ రెండు విలీన దిశగా అడుగులు వేస్తున్నాయనే వార్తలు గుప్పుమనడం. చైనాలో మాదిరిగానే.. భారత్‌లోకూడా ఉబెర్‌ ప్రధాన ప్రత్యర్థి ఓలాతో విలీనం కానుందనే అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. కాగా ఈ రెండింటికి పెట్టుబడిదారుగా జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఉన్నట్లు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి.

కుంటిసాకులు చెప్పకండి, టెలికాం దిగ్గజాలను ఆడేసుకున్నకేంద్రం !కుంటిసాకులు చెప్పకండి, టెలికాం దిగ్గజాలను ఆడేసుకున్నకేంద్రం !

 ఉబెర్‌లో 9.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ద్వారా..

ఉబెర్‌లో 9.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ద్వారా..

ఈ మధ్య రెండు సంస్థల్లోనూ ఉమ్మడి పెట్టుబడిదారుగా ఉన్న జపాన్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఉబెర్‌లో 9.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ద్వారా ఇటీవల కీలక సంకేతాలు అందించింది. దీనికి తోడు త్వరలో ఉబెర్‌ బోర్డులో చేరనున్న సాఫ్ట్‌బ్యాంక్‌ బోర్డు సభ్యుడు, త్వరలోనే ఉబెర్‌ బోర్డులో చేరనున్న రాజీవ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు ఊతమిచ్చాయి.

సేవలనుంచి ఇక తప్పుకునే అవకాశం ..

సేవలనుంచి ఇక తప్పుకునే అవకాశం ..

భారత్‌లో ఉబెర్‌ క్యాబ్‌ సేవలనుంచి ఇక తప్పుకునే అవకాశం ఉందని, ఓలా ఉబెర్‌ మధ్య విలీన చర్చలు కొలిక్కి రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విలీనం సాధ్యమైతే కాంపిటీషన్‌ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

అధిక ఆదాయ వనరు కోసం..
 

అధిక ఆదాయ వనరు కోసం..

నష్టాలను తగ్గించుకునే ఉద్దేశంతో కాకపోయినప్పటికీ.. అమెరికా, యూరప్‌, లాటిన్‌ అమెరికా, అస్ట్రేలియా లాంటి మార్కెట్లకు మళ్లితే లాభదాయకంగా ఉంటుందని ఆయన తెలిపారు.అందులో భాగంగానే అధిక ఆదాయ వనరుగా ఉన్న అమెరికా, యూరప్‌ మార్కెట్లపై దృష్టి కేంద్రీ కరించినట్టు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

విలీన వార్తలను..

విలీన వార్తలను..

కాగా ఉబెర్ ఇండియా ప్రతినిధి ఈ విలీన వార్తలను నిరాధారమైన ఊహాగానాలుగా కొట్టిపారేశారు. భారత్‌లో తమ వ్యాపారాలు ఎప్పటికన్నా బలంగా ఉన్నాయని, ఇక్కడి రైడర్లు, డ్రైవర్ల భాగస్వామ్యాలకు 100 శాతం తాము కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపారు.

ఓలా..

ఓలా..

ఇక దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన ఓలా భారత్‌లో తమతో పోటీకారణంగా ఉబెర్‌ తన ప్రధాన మార్కెట్లకు మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రధానంగా డ్రైవర్లను, కస్టమర్లును ఆకట్టుకోవడానికి బిలియన్ల డాలర్ల ప్రోత్సాహకాలు, డిస్కౌంట్ల వల విసిరిందనీ ఆరోపించింది.

రైడింగ్‌ అంచనాల ప్రకారం

రైడింగ్‌ అంచనాల ప్రకారం

కాగా రైడింగ్‌ అంచనాల ప్రకారం సుమారు 110 నగరాల్లో సేవలు అందిస్తున్న ఓలా ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉంది. రోజుకు రెండు మిలియన్లకుపైగా రైడ్లను నమోదు చేస్తోంది. ఉబెర్‌ 25 నగరాల్లో రోజుకు ఒక మిలియనుకు పైగా రైడ్స్‌ సాధిస్తోంది.

Best Mobiles in India

English summary
Will Ola and Uber merge in India? SoftBank board member thinks it will be good for business More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X