ఈ యాప్స్‌తో మీ ఫోన్ గోవిందా గోవిందా..!

|

స్మార్ట్‌ఫోన్‌ల పై వినియోగం అంతకంతకు పెరిగిపోతుండటంతో బ్యాటరీ బ్యాకప్ సమస్య ప్రతి ఒక్కరికి సవాల్‌గా మారిపోయింది. ఫోన్‌లో నిక్షిప్తమై ఉండే రకరకాల యాప్స్ బ్యాటరీ శక్తిని మొత్తాన్ని నాలుగైదు గంటల్లో ఆవిరి చేసేస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకావాలంటే ఫోన్ వినియోగం పట్ల కొత్త ప్రణాళికలతో పాటు పొదుపు మంత్రాన్ని జపించక తప్పదు.

Read More : పాత మొబైల్ ఇస్తే కొత్త స్మార్ట్‌ఫోన్, ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

battery eating apps

ఫోన్‌లోని ఏ పని చేయాలన్న సంబంధిత యాప్‌‌ను ఓపెన్ చేయవల్సి ఉంటుంది. ఫోన్‌లో ఇన్‌స్టెంట్‌గా చేసే డాక్యుమెంట్ ఎడిటింగ్ మొదలుకుని ఆడియో వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా చాటింగ్, ఆన్‌లైన్ గేమింగ్ ఇలా అనేక పనులు ఇంటర్నెట్ కనెక్షన్‌తో ముడిపడి ఉంటాయి. ఇన్ని పనులను చక్కదిద్దే క్రమంలో యాప్స్ బోలెండత బ్యాటరీని కన్స్యూమ్ చేసుకుంటాయి.

Read More : ఇంట్లో దొరికే వస్తువులతో మన గాడ్జెట్‌లను క్లీన్ చేసుకోవటం ఎలా..?

battery eating apps

ఫోన్‌లో అవసరమైన యాప్స్‌ను మాత్రమే ఉంచుకుని అనవసరమైన యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా కొంతలో కొంత బ్యాటరీ లైఫ్‌ను ఆదా చేసుకోవచ్చు. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను తక్షణమే పెంచుకోవాలనుకుంటున్నట్లయితే ఈ క్రింది సూచించే యాప్స్‌ను తక్షణమే అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి.

బ్యాటరీ సేవింగ్ లేదా ర్యామ్ క్లీనింగ్ యాప్స్

బ్యాటరీ సేవింగ్ లేదా ర్యామ్ క్లీనింగ్ యాప్స్

బ్యాటరీ సేవింగ్ లేదా ర్యామ్ క్లీనింగ్ యాప్స్, మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా రన్ అవుతూ ఎటువంటి ఉపయోగం లేకుండా బ్యాటరీని నెమ్మదిగా ఆరగించేస్తుంటాయి.

సోషల్ మీడియా యాప్స్

సోషల్ మీడియా యాప్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో ఒకటైన ఫేస్‌బుక్, బ్యాటరీ డ్రెయినింగ్ యాప్స్ జాబితాలోనూ ముందు వరసలో ఉంది. ఈ యాప్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ నిరంతరం నోటిఫికేషన్‌లను సెండ్ చేస్తూనే ఉంటుంది. ఒక్క ఫేస్‌బుక్ మాత్రమే కాదు స్నాప్‌చాట్, స్కైప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి హెవీ సోషల్ మీడియా యాప్స్ కూడా ఫోన్ బ్యాటరీని వేగవంతంగా తినేస్తుంటాయి.

యాంటీ వైరస్ యాప్స్
 

యాంటీ వైరస్ యాప్స్

బ్యాటరీ సేవర్ యాప్స్ ఇంకా ర్యామ్ క్లీనింగ్ యాప్స్ తరహాలోనే యాంటీ వైరస్ యాప్స్ కూడా మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా రన్ అవుతూ ఎటువంటి ఉపయోగం లేకుండా బ్యాటరీని నెమ్మదిగా ఆరగించేస్తుంటాయి. కాబట్టి ఏదైనా ఒక్క యాంటీవైరస్ యాప్‌ను మాత్రమే ఫోన్‌లో ఉంచుకోండి.

ఫోటో ఎడిటింగ్ యాప్స్

ఫోటో ఎడిటింగ్ యాప్స్

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను ఎక్కువగా ఖర్చు చేసే యాప్స్ జాబితాలో ఫోటో ఎడిటింగ్ యాప్స్ ముందు వరసలో ఉన్నాయి. హెవీ సైజులో ఉండే ఈ యాప్స్ రన్ అవ్వాలంటే ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ అవసరమవుతుంది. Adobe Lightroom, Photoshop Express, Pixlr Express వంటి యాప్స్ ఎక్కువ మొత్తం శక్తిని ఖర్చు చేసుకుంటాయి.

ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్స్

ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్స్

మీ ఫోన్‌లో అదనంగా ఉండే బ్రౌజర్ యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఆదా అవుతుంది.

 

గేమింగ్ యాప్స్

గేమింగ్ యాప్స్

ఫోన్ బ్యాటరీని ఎక్కువగా ఖర్చు చేసే యాప్స్ జాబితాలో గేమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయటం మంచిది. Asphalt, Injustice, Modern Combat వంటి 3డీ యానిమేషన్ గేమ్స్ ఎక్కువ బ్యాటరీని ఖర్చుచేస్తున్నట్లు పరిశీలనలో తేలింది.

Best Mobiles in India

English summary
Worst apps for your smartphone’s battery. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X