Home
Apps

X యాప్‌లో పేమెంట్స్‌ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుంది.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది..?

ఎలాన్‌ మస్క్‌కు చెందిన ప్రముఖ మైక్రో బ్లాకింగ్‌ ప్లాట్‌ఫాం X (గతంలో ట్విట్టర్‌) లో క్రమంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవ్రీథింగ్‌ యాప్‌ గా (Everything App) అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో అనేక ఫీచర్‌ లను విడుదల చేస్తున్నారు. తాజాగా X యాప్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ ఫీచర్ వివరాలు వెల్లడయ్యాయి. X ప్లాట్‌ఫాం సీఈవో లిండా యాకారినో X money ఫీచర్‌ పై ప్రకటన చేశారు. X యాప్‌ నుంచి పేమెంట్స్‌ సర్వీసుల కోసం Visa సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్‌ ను సంవత్సరంలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

అనేక పేమెంట్‌ ఆప్షన్‌లు :
X మనీ ఫీచర్‌ ద్వారా సులభంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని X యాప్‌ సీఈవో తెలిపారు. దీని ద్వారా X వ్యాలెట్‌ లోకి ఇన్‌స్టంట్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరియు పీర్‌ టూ పీర్‌ (P2P) పేమెంట్స్‌, బ్యాంకు అకౌంట్‌లకు కూడా సులభంగా నగదు బదిలీ చేసుకోవచ్చు.

X money

ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది :
యూజర్లు తమ అకౌంట్స్‌కు డెబిట్‌ కార్డులను లింక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలోని అనేక యాప్‌లు P2P పేమెంట్స్‌ను సపోర్టు చేస్తున్నట్లు లిండా యాకారినో తెలిపారు. X మనీ యాప్‌ కచ్చితంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

ఎవ్రీథింగ్‌ యాప్‌గా X :
ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఎలాన్‌ మస్క్‌ ప్లాట్‌ఫాం పేరుతో సహా అనేక మార్పులు చేశారు. Everything App గా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కేవలం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం గానే కాకుండా పేమెంట్స్‌, మెసేజింగ్‌, ఇ-కామర్స్‌, మల్టీమీడియా వంటి అనేక ఫీచర్లను అందించాలని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా పేమెంట్స్ ఫీచర్‌ పైన కీలక ప్రకటన వచ్చింది. అమెరికాలో ఈ సంవత్సరంలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. దీంతోపాటు AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) చాట్‌బాట్‌ గ్రోక్‌లో భారీ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్పులతో యూజర్లు మరింతగా ప్లాట్‌ఫాంకు కనెక్ట్‌ అవుతారని భావిస్తున్నారు.

ఇప్పటికే చైనాలో :
చైనాకు చెందిన we Chat ప్రస్తుతం ఎవ్రీథింగ్ యాప్‌గా ఉంది. ఈ చైనా యాప్‌ ద్వారా పేమెంట్స్‌, కొనుగోళ్లు, మెసేజింగ్‌ వంటి అనేక ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇదే తరహాలో X యాప్‌లో కూడా కీలక మార్పులు తీసుకురావాలని ఎలాన్‌ మస్క్‌ భావిస్తున్నారు.

గతంలో కీలక ప్రకటన చేసిన మస్క్ :
ఇటీవలే ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు. X యాప్‌ కోసం టాలెంట్ ఉన్న ఇంజినీర్లు కావాలన్నారు. అయితే ఇందుకోసం డిగ్రీలు, పెద్ద సంస్థల్లో పనిచేసిన అనుభవం అవసరం లేదన్నారు. అభ్యర్థులు తమ నైపుణ్యాలను నిరూపించుకుంటే చాలని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

గతంలోనే ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. తన మరో సంస్థ టెస్లాలో ఉద్యోగాలను పొందేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని చెప్పారు. దీంతోపాటు ప్రస్తుత విద్యా విధానంపైనా మస్క్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల పైనే సంస్థలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయని.. రియల్‌టైం లో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అందించే దిశగా కృషిచేయడం లేదన్నారు.

ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌, ఎక్స్ యాప్‌ వంటి సంస్థలు ఉద్యోగులను ప్రత్యేక విధానంలో నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మస్క్‌ తాజా ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. చదువు లేకున్న నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు ఇదో మంచి అవకాశం అని కొంత మంది భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
X app CEO Linda catalina announcement on X money for digital payments
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X