Home
Apps

యూట్యూబ్‌కు పోటీగా TV యాప్‌.. ఫీచర్లు, అల్గారిథమ్‌ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్ X గా రీబ్రాండ్‌ చేయడం సహా అనేక కీలక మార్పులు చేస్తున్నారు. ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు అనేక కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలోనే TV కోసం యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు. అయితే తాజాగా X సీఈవో లిండా కూడా ఈ యాప్‌ పైన స్పందించారు.

అధిక నాణ్యత కలిగిన కంటెంట్‌ను వీక్షించవచ్చని X ప్లాట్‌ఫాం సీఈవో తెలిపారు. ఈ TV యాప్‌ ప్రముఖ వీడియో కంటెంట్‌ యాప్‌ యూట్యూబ్‌కు పోటీగా లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ X ప్లాట్‌ఫాం టీవీ యాప్ ఇంటర్‌ఫేస్‌ టీవీ యాప్‌ మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

X platform CEO linda confirmed TV app

ఈ X ప్లాట్‌ఫాం TV యాప్‌ ద్వారా స్మార్ట్‌టీవీ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ సహా ఇతర రియల్‌టైం షోలను వీక్షించవచ్చని సీఈవో లిండా వెల్లడించారు. ఫలితంగా ఈ మెరుగైన అనుభూతి సొంతం అవుతుందని అంచనా వేశారు. ట్రెండింగ్‌ వీడియో అల్గారిథమ్‌, వీడియో సెర్చ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత థీమ్స్‌, క్రాస్ డివైస్ కాంపాక్టబిలిటీ వంటి అనేక ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇటీవల X లో ప్రీమియం ఫీచర్లు కొద్ది మందికి అందుబాటులో ఉండేవి. అయితే కొన్ని రోజుల క్రితం వాటిని ఫీచర్ల.. ప్రత్యేక కేటగిరి కలిగిన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. X లో 2500 కంటే ఎక్కువ వెరిఫైడ్‌ సబ్‌స్క్రైబర్లు ఫాలోయర్లుగా ఉన్న వారు ప్రీమియం ఫీచర్లను ఉచితంగానే పొందవచ్చని తెలిపారు. దాంతోపాటు 5000 వైరిఫైడ్‌ సబ్‌స్కైబర్లు ఫాలోయర్లుగా ఉంటే ప్రీమియం+ ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చని ప్రకటన చేశారు.

X ప్రీమియం మరియు ప్రీమియం + సబ్‌స్క్రైబర్లు ఇతర ప్రయోజనాలతోపాటు ఇటీవల కొత్తగా లాంచ్‌ అయిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బోట్‌ GrokAI యాక్సెస్‌ను పొందవచ్చు. గతంలో కేవలం ప్రీమియం+ సబ్‌స్కైబర్లకు మాత్రమే ఈ చాట్‌బోట్‌ అందుబాటులో ఉండేది. ఈ వారం చివర నుంచి ఈ చాట్‌బోట్‌ ప్రీమియం, ప్రీమియం+ యూజర్లకు అందుబాటులో ఉంటుందని మస్క్‌ తెలిపారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత Grok AI ను గత సంవత్సరం నవంబర్‌లో ఆవిష్కరించారు. ఎటువంటి ప్రశ్నను అయినా ఈ చాట్‌బోట్ బదులివ్వగలదని సంబంధిత టీం వెల్లడించింది. దీంతోపాటు ఈ చాట్‌బోట్‌ రియల్‌ టైం సమాచారాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. ఇతర AI చాట్‌బోట్‌లు రిజెక్ట్‌ చేసిన ప్రశ్నలను కూడా ఈ చాట్‌బోట్‌ సమాధానాలిస్తుందని పేర్కొంది.

దీంతోపాటు X ప్లాట్‌ఫాంలో linkedin తరహా ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఫలితంగా ఈ జాబ్‌ సెర్చ్‌ ప్లాట్‌ఫాంకు పోటీనిచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇటీవలే లీక్ అయ్యాయి. ఉద్యోగ అనుభవం సహా ఇతర వివరాలు ఆధారంగా సంస్థలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మిలియన్‌ పైగా ఉద్యోగాల కోసం X వేదికగా సంస్థలు ప్రకటనలు ఇచ్చాయని వెల్లడించింది.

Best Mobiles in India

English summary
X platform CEO linda confirmed TV app explains how compete with YouTube
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X