Home
Apps

X (ట్విట్టర్‌)లో ఆడియో, వీడియో కాల్‌ ఫీచర్‌.. ఎలా యాక్టివేట్‌ చేయాలంటే?

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం X (ట్విట్టర్‌)ను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో X సీఈవో వెల్లడించారు. అందుకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా X ప్లాట్‌ఫాం కీలక ఫీచర్‌ను విడుదల చేసింది. అయితే దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

X ప్లాట్‌ఫాంలో ఆడియో మరియు వీడియో కాల్ ఫీచర్‌ను (X audio and Video call feature) విడుదల చేసింది. యాప్‌ తెరవగానే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ కనిపిస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా వీడియో కాల్‌ మాట్లాడుతున్న స్క్రీన్‌షాట్‌ను X సీఈవో లిండా తన హ్యాండిల్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. దీనిపై X తన అధికారిక హ్యాండిల్‌ ద్వారా 'ready for it' అనే క్యాప్షన్‌ను పోస్టు చేసింది.

Twitter rolls out audio and video call feature

X ప్లాట్‌ఫాంలో ఆడియా మరియు వీడియో కాల్‌ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం ఎలా ?
X ప్లాట్‌ఫాంలో ఆడియా మరియు వీడియో కాల్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసేందుకు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది. ఇందులో ఎవరూ తమకు వీడియో కాల్‌ చేయవచ్చో ఎంపిక చేయవచ్చు. వెరిఫైడ్‌ యూజర్లు, ఫాలో అవుతున్న ఖాతాలు, అడ్రస్‌ బుక్‌లో ఉన్న వారు వంటి ఆప్షన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఈ ఆప్షన్‌ మీకు కనిపించకుంటే ముందుగా X (ట్విట్టర్‌) యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ప్రైవసీ మరియు సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అనంతరం డైరెక్ట్‌ మెసేజ్‌ ఆప్షన్‌ను ట్యాప్‌ చేయాలి. చివరికి అక్కడ కనిపించిన ఆడియో మరియు వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను ఎంచుకోవాలి. అక్కడ కుడివైపున ఫోన్ సింబల్‌ను గుర్తించవచ్చు.

* కొన్నిరోజుల క్రితం X (ట్విట్టర్‌) కొత్త నిర్ణయం తీసుకుంది. తొలి దశలో న్యూజిలాండ్‌, ఫిలిప్పెన్స్‌లో ఈ విధానంలో అమల్లోకి వచ్చింది. ట్విట్టర్‌ (X)లో ఏదైనా పోస్టును లైక్, కామెంట్‌, షేర్ చేయాలన్నా.. కనీస ఛార్జీలు చెల్సించాల్సిన ఉంటుందని ప్రకటన చేశారు. ట్వీట్‌లను ఉచితంగానే చదువుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ దేశాల్లోని X వినియోగదారులు సంవత్సరానికి 1 USD (అమెరిక్‌ డాలర్‌) చెల్సించాల్సి ఉంటుంది.

ఈ విధానం కింద కొత్త, అన్‌వెరిఫైడ్‌ ఖాతాదారులు పోస్టులను లైక్‌, కామెంట్‌, షేర్‌ చేసేందుకు సంవత్సరానికి $1 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఈ కొత్త విధానం ద్వారా ప్రభావితం చెందరని అని పోస్టు చేసింది. X ప్లాట్‌ఫాంలో బాట్ (నకిలీ ఖాతా)ల నియంత్రణ సహా ఇతర కారణాలతో ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేసినట్లు పోస్టులో పేర్కొంది.

ఈ కొత్త విధానంపై ట్విట్టర్‌ (X) అధినేత ఎలాన్ మస్క్‌ (Elon Musk) కూడా స్పందించారు. ఉచితంగా చదవండి. కానీ రాసేందుకు $1/ సంవత్సరం చెల్లంచాల్సి ఉంటుందని రాసుకొచ్చారు. బాట్లతో పోరాడేందుకు ఇదో మంచి మార్గమని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే దీని ద్వారా బాట్లను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
X rolls out audio and video call feature know how to enable it
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X