Mi క్రెడిట్ సర్వీస్ ద్వారా ఒక నెలలో 125 కోట్ల రుణాలను పంపిణి చేసిన షియోమి

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి Mi క్రెడిట్ సర్వీస్ ద్వారా 2019 డిసెంబర్ వరకు ఇండియాలో సుమారు 125 కోట్ల రూపాయల వరకు రుణాలను పంపిణీ చేసినట్లు ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టివి బ్రాండ్ Mi తన అభిమానులకు ఉత్తమ వ్యక్తిగత రుణాలను అందించడమే లక్ష్యంగా డిసెంబర్ నెల ప్రారంభంలో ఇండియాలో Mi క్రెడిట్‌ సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ రుణాల పంపిణీలో షియోమియేతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు దాదాపు 50 శాతం పొందినట్లు కంపెనీ ధృవీకరించింది.

Mi
 

Mi క్రెడిట్ యాప్ మిలీనియల్స్ మరియు ఇంటర్నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని షియోమి యొక్క పెరుగుతున్న పర్యావరణ సేవల యొక్క భాగం. ఈ సర్వీస్ వినియోగదారులను వారి క్రెడిట్ స్కోర్‌ను తక్షణమే తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఉచితంగా లభిస్తుంది మరియు ఇది ఎక్స్‌పీరియన్ చేత శక్తిని పొందుతుంది.

Mi క్రెడిట్: రుణ పంపిణీ వివరాలు

Mi క్రెడిట్: రుణ పంపిణీ వివరాలు

షియోమి 2019 డిసెంబర్ నెలలో సుమారు పదిలక్షల మంది వినియోగదారులు ఈ సర్వీస్ ద్వారా రుణాలు పొందారని కంపెనీ ధృవీకరించారు. ఈ యాప్ MIUI తో రన్ అవుతున్న షియోమి స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీలోడ్ చేయబడి వస్తుంది. మిగిలిన వారు దీనిని గూగుల్ ప్లే స్టోర్, గెట్‌అప్స్ మరియు షియోమి యొక్క సొంత యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంది.

భారీ తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్ లో Oppo K1 స్మార్ట్‌ఫోన్‌

NBFCలు

ఇప్పటి వరకు రుణాలను పొందిన భాగస్వాములు ప్రధానంగా NBFCలు లేదా ఫిన్టెక్‌లు. వారిలో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్, మనీ వ్యూ, ఎర్లీసాలరీ, జెస్ట్‌మనీ మరియు క్రెడిట్ విద్యా ఉన్నాయి అని కంపెనీ తెలిపింది. ఇది ఔత్సాహిక యువ నిపుణులు మరియు మిలీనియల్స్ కోసం మొదటి వ్యక్తిగత రుణ ఎంపికగా నిర్మించబడింది. Mi క్రెడిట్ 100 శాతం డిజిటల్ అనుభవంతో సాంప్రదాయ రుణ పరిశ్రమతో ముడిపడి ఉన్న చాలా సవాళ్లను పరిష్కరిస్తుంది.

Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

Mi క్రెడిట్ యాప్
 

Mi క్రెడిట్ యాప్

Mi క్రెడిట్ యాప్ సులభమైన మరియు ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో లోన్ ను పొందటానికి ఒక వేదికగా పనిచేస్తుంది. మొదటిసారి వినియోగదారులు ఐదు నిమిషాల్లో తమ దరఖాస్తును పూర్తి చేసుకోవచ్చు. అలాగే రిపీట్ కస్టమర్లు ఒకే ఒక క్లిక్ ద్వారా లోన్ ను పొందవచ్చు.

Realme 5i : క్వాడ్ కెమెరా సెటప్‌తో రిలీజ్... ధరకు సమానమైన ఆఫర్లు

తక్కువ వడ్డీ

లోన్ ఆమోదించబడిన తర్వాత కస్టమర్ మొత్తాన్ని మరియు పదవీకాలం ఎంచుకునే అవకాశం ఉంది. రుణాల రియల్ టైమ్ పంపిణీ మరియు తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనంతో వస్తుంది అని షియోమి పేర్కొంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం మరిన్ని ఇతర ప్రయోజనాలతో పాటు కూడా వస్తుంది.

Airtel WiFi Calling : మరింత వేగంగా విస్తరిస్తున్న సర్వీస్

షియోమి

ఇది బహుళ రుణదాతలతో కూడిన వేదిక కాబట్టి రుణం పొందే అవకాశాలు అనేక పద్దతులలో పెంచుతాయి. ఇది మార్కెట్లో ఉన్న ఇతరలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేటుతో అధిక రుణ మొత్తంను అందిస్తుంది. హార్డ్‌వేర్ అమ్మకాల నుంచి వచ్చే ఆదాయాన్ని 5 శాతానికి పరిమితం చేస్తామని షియోమి ప్రకటించింది. ఇది తన క్రెడిట్ మూలాన్ని Mi క్రెడిట్ వంటి ఇంటర్నెట్ సేవలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Distributes 125 Crores of Loans in One Month Through Mi Credit Service

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X