గూగుల్ పే ద్వారా షియోమి బంపరాఫర్లు

గూగుల్ పేమెంట్ యాప్ గూగుల్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు గూగుల్ పేగా రూపాంతరం చెందింది.

|

గూగుల్ పేమెంట్ యాప్ గూగుల్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు గూగుల్ పేగా రూపాంతరం చెందింది. దీన్ని 2017 సెప్టెంబర్ లో లాంచ్ చేశారు. అప్పటి నుండి యూజర్లలో విపరీతమైన ఆసక్తిని ఇది క్రియేట్ చేస్తూ వస్తోంది. అనేక కంపెనీలతో టైఅప్ అయి అనేక రకాలైన ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. తాజాగా ఈ యాప్ చైనా దిగ్గజం షియోమితో కూడా టైఅప్ అయింది. గూగుల్ పే ద్వారా మికామ్,మీ స్టోర్లలో ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే అట్రాక్టివ్ రివార్డు పాయింట్లను అందించనుంది. అయితే ఇది ఇంతకుముందు శుక్రవారం మాత్రమే ఉంటే ఇప్పుడు దాన్ని మూడు రోజులకు పెంచుతూ షియోమి నిర్ణయం తీసుకుంది.కాగా గూగుల్ పే గూగుల్ ఫైల్స్ యాప్ అలాగే గూగుల్ డుయో యాప్ ద్వారా వీడియో కాల్స్ చేసిన వారికి రివార్డు పాయింట్లను గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

జియో సెలబ్రేషన్స్ ప్యాక్‌: 8జీబీ ఫ్రీ డేటా ఇస్తున్న జియోజియో సెలబ్రేషన్స్ ప్యాక్‌: 8జీబీ ఫ్రీ డేటా ఇస్తున్న జియో

రివార్డు పాయింట్లు పొందడం ఎలా ?

రివార్డు పాయింట్లు పొందడం ఎలా ?

మీరు ముందుగా మి.కామ్ వైబ్ సైట్ కాని మి స్టోర్ యాప్ కాని సందర్శించాలి. అక్కడ మీరు రూ.5000 విలువ గల వస్తువులను సింగిల్ లావాదేవీ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పే చేసే సమయంలో మీరు గూగుల్ పే యుపిఐ ఐడి ట్రాన్సిక్షన్స్ లోకి ఎంటర్ అయి అక్కడ మీరు పెమేంట్ ఆప్సన్ సెలక్ట్ చేసుకోవాలి.

 

 

ఈ ప్రాసెస్ అయిన తరువాత...

ఈ ప్రాసెస్ అయిన తరువాత...

ఈ ప్రాసెస్ అయిన తరువాత మీరు రివార్డు పాయింట్లను అందుకుంటారు. అయితే ఈ రివార్డు పాయింట్లు వారంలో మూడు రోజులు ( బుధ, గురు శుక్రవారాలు ) మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. ఈ మూడు రోజుల్లో చేసే లావాదేవీలకు మాత్రమే రివార్డు పాయింట్లు వర్తిస్తాయి.

లావాదేవీని క్యాన్సిల్ చేసుకున్నా...
 

లావాదేవీని క్యాన్సిల్ చేసుకున్నా...

ఒకవేళ మీరు లావాదేవీని క్యాన్సిల్ చేసుకున్నా, రీఫండ్ కోసం అప్లయి చేసినా ఈ ఆఫర్ వర్తించదు. మీకు స్కాచ్ కార్డు వచ్చినా అది పనిచేయదు . గూగుల్ పే అకౌంట్ నుండి ఆ స్కాచ్ కార్డు రిమూవ్ చేయబడుతుంది. ఒకవేళ మీరకు ఆ కార్డు నుంచి డబ్బులు వచ్చినా అవి వెనక్కి తీసుకోబడతాయి.

 

 

 మీరు లావాదేవీ జరిపిన తరువాత....

మీరు లావాదేవీ జరిపిన తరువాత....

ఈ రివార్డు పాయింట్లు మీరు లావాదేవీ జరిపిన తరువాత 6 నుంచి 8 రోజుల వ్యవధిలో దాని ఫలితం మీకు కనిపించే అవకాశం ఉంటుంది. షియోమి గూగుల్ పే ద్వారా మీరు ప్రతి లావాదేవీకి రూ.100 నుంచి రూ. 500 వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

 ఈ ఆఫర్ తమిళనాడ వాసులకు వర్తించదు....

ఈ ఆఫర్ తమిళనాడ వాసులకు వర్తించదు....

ఇలా లావాదేవీ జరిపిన ప్రతిసారి మీకు స్కాచ్ కార్డు ద్వారా వచ్చే మనీ మొత్తం నేరుగా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మీరు ఇది వరకే గూగుల్ పేకి యాడ్ అయిన అకౌంట్ ద్వారా ఈ మొత్తం జమ అవుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆఫర్ తమిళనాడ వాసులకు వర్తించదు.

Best Mobiles in India

English summary
Purchase on Mi.com and earn Google Pay rewards: All you need to know more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X