Xiaomi నుంచి మరో ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ Mi A2

|

షావోమి Mi A1 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ఆ సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతోన్న Mi A2 మోడల్ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. Mi 6X పేరుతో ఈ ఫోన్ లాంచ్ కావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డివైస్‌కు సంబంధించిన తాజాగా వెలుగులోకి వచ్చిన పలు లీక్స్ ప్రకారం.. Mi A2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు స్విస్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ పోర్టల్ ద్వారా బహిర్గతమయ్యాయి. ఈ పోర్టల్ పేజీలో Mi A2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ పొందుపరచబడి ఉన్నాయి.

 

రూ.10 వేల కేటగిరిలో బెస్ట్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్రూ.10 వేల కేటగిరిలో బెస్ట్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్

బ్లాక్, బ్లూ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం..

బ్లాక్, బ్లూ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం..

స్విట్జర్లాండ్‌కు చెందిన డిజిటెక్ అనే వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం Mi A2 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 32జీబి వేరియంట్ ధర CHF 289 (ఇండియన్ కరెన్సీలో రూ.19,800), 64జీబి వేరియంట్ ధర CHF 329 (ఇండియన్ కరెన్సీలో రూ. 22,500), 128జీబి వేరియంట్ ధర CHF 369 (ఇండియన్ కరెన్సీలో రూ. 25,200)గాను ఉంటుందని తెలుస్తోంది.

 Mi A2 స్పెసిఫికేషన్స్ ( అంచనా )

Mi A2 స్పెసిఫికేషన్స్ ( అంచనా )

డిజిటెక్ పేర్కొన్న వివరాల ప్రకారం Mi A2 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..
5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (రిసల్యూషన్ క్వాలిటీ 1080x2160 పిక్సల్స్) డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 సాక్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ వీ5.0.

 ఆండ్రాయిడ్ వన్ అంటే ఏంటి..?
 

ఆండ్రాయిడ్ వన్ అంటే ఏంటి..?

ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ కంనీ సీఈఓ సుందర్ పిచాయ్ 2014లో లాంచ్ చేసారు. రూ.6000లోపు స్మార్ట్‌ఫోన్‌లలో కూడా క్వాలిటీ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయాలన్నది ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్య ఉద్దేశ్యం. ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల కోసం రూపొందించబడిన రిఫరెన్స్ హార్డ్‌వేర్ డిజైన్‌ను కూడా గూగుల్, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు ప్రొవైడ్ చేసింది. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లకు రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లభిస్తాయని గూగుల్ తెలిపింది.

ఆదిలోనే చుక్కెదురు...

ఆదిలోనే చుక్కెదురు...

భారత్‌లో ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ వంటి లోకల్ బ్రాండ్‌లు సెప్టంబర్ 2014లో లాంచ్ చేసాయి. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను ఇండియన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు సుందర్ పిచాయ్ తెలపటంతో ఈ ప్లాట్ ఫామ్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, ఫిలిప్పిన్స్, బాంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా గూగల్ లాంచ్ చేసింది. అయితే అనుకున్నంత స్థాయిలో ఆండ్రాయిడ్ వన్ ఆకట్టుకోలేకపోవటంతో ఈ ప్రాజెక్టును గూగుల్ కొంతకాలం పక్కనపెట్టింది. గతేడాది షియోమితో కలిసి గూగుల్ తిరిగి తన ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Mi A1తో ఆండ్రాయిడ్ వన్ విజయం..

Mi A1తో ఆండ్రాయిడ్ వన్ విజయం..

ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ వన్ ఫెయిల్ అవటంతో చాలా రోజులు సైలెంట్‌గా ఉండిపోయిన గూగుల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. షియోమీ సహకారంలో గూగల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. షియోమి Mi A1 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ మార్కెట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ఊపులో Mi A2ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

Mi A1లో మార్పు చేర్పులు..

Mi A1లో మార్పు చేర్పులు..

వాస్తవానికి ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో మార్కెట్ చేయవల్సి ఉండగా, షియోమీ Mi A1లో మాత్రం కొన్ని మార్పు చేర్పులు జరిగాయి. స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఆ ఫోన్‌లో ఎటువంటి యాప్ ఎడిషన్స్ ఉండకూడదు. అయితే Mi A1లో మాత్రం మూడు షియోమి యాప్స్ ఉన్నాయి. అందులో ఒకటి కెమెరా యాప్ కాగా మిగితావి Mi Store షాపింగ్ పోర్టల్ యాప్, Mi రిమోట్ యాప్.

Best Mobiles in India

English summary
Xiaomi Mi A2 Android One Smartphone Gets Listed in Switzerland, Specifications Leaked More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X