Xiaomi యూజర్లకు గుడ్ న్యూస్, సరికొత్తగా పాత సేవలు

Written By:

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి యూజర్లకు శుభవార్తను మోసుకొచ్చింది. తన సేవల విసర్తణలో భాగంగా సరికొత్తగా ముందుకు దూసుకువచ్చింది. షియోమి మ్యూజిక్‌ ప్రియుల కోసం ఎంఐ వీడియో, ఎంఐ మ్యూజిక్‌ యాప్‌లకు కొత్త సొబగులు అద్దింది. ఇప్పటికే ఈ యాప్స్‌ ఆయా ఫోన్లలో ఉన్నప్పటికీ అవి ఫోన్‌ స్టోరేజీలో ఉన్న మ్యూజిక్‌, వీడియోలను మాత్రమే ప్లే చేస్తున్నాయి. దీంతో వీడియోలు, పాటల కోసం ఇతర సర్వీసులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ.. వివిధ కంపెనీల భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌ కంటెంట్‌ను ఈ రెండు యాప్స్‌ కింద అందిస్తోంది. ఎంఐ మ్యూజిక్‌ ఇప్పటికే అందుబాటులోకి రాగా, ఎంఐ వీడియో సేవలు వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

కాల్‌డ్రాప్స్ సమస్యకు చెక్, ఇకపై టెలిఫోనీ యాప్ ఉంటే చాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంఐ వీడియో ద్వారా..

ఎంఐ వీడియో ద్వారా వివిధ స్ట్రీమింగ్‌ సర్వీసులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. సోనీ ఎల్‌ఐవీ, హంగామా ప్లే, వూట్‌, ఆల్ట్‌ బాలాజీ, జీ5, వీఐయూ, టీవీఎఫ్‌ వంటివి ఇందులో ఉన్నాయి. ఇందులో 5 లక్షల గంటల నిడివి గల వీడియో కంటెంట్‌ అందుబాటులో ఉంటుందని, అందులో 80 శాతం ఉచితంగానే లభిస్తుందని కంపెనీ ఇండియా హెడ్‌ మనుకుమార్‌ జైన్‌ తెలిపారు.

హంగామాతో ..

ఎంఐ మ్యూజిక్‌ కోసం హంగామాతో షియామి జతకట్టింది. దీనిద్వారా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ తదితర 13 భాషల్లోని కోటికి పైగా పాటలను ఉచితంగా ఆనందించొచ్చని కంపెనీ తెలిపింది.

డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మాత్రం..

అయితే మీకు నచ్చిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మాత్రం ఏడాదికి రూ.899 చెల్లించి హంగామా ప్రో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఫార్వర్డ్‌..

దీంతో పాటు ఎంఐ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త డైనమిక్‌ లిరిక్‌ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీనిద్వారా ఒకవైపు మ్యూజిక్‌ ప్లే అవుతున్నప్పుడు పాట లిరిక్‌ కూడా మనకు కనిపిస్తుంది. లిరిక్‌ని ముందుకు జరపడం ద్వారా పాటను ఫార్వర్డ్‌ చేయొచ్చు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోను..

ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోను దాఖలు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజ కంపెనీ హాంగ్ కాంగ్ ఎక్స్చేంజెస్ అండ్‌ క్లియరింగ్ లిమిటెడ్‌కు ఈ అతిపెద్ద ఐపీవోను సమర్పించింది.

2014 తర్వాత ఇదే బిగ్గెస్ట్‌ ఐపీవో..

బ్లూమ్‌బర్గ్‌ అందించిన స​మాచారం ప్రకారం 2014 తర్వాత ఇదే బిగ్గెస్ట్‌ ఐపీవోగా భావిస్తున్నారు. షియోమి సమర్పించిన ఐపీవోతో లిస్టింగ్‌తో కంపెనీ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా.

అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తర్వాత.

అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తర్వాత చైనాలో అతిపెద్ద టెక్‌ ఐపీవోగా నిలవనుంది. 2014 లో అలీబాబా గ్రూప్ 21.8 బిలియన్ డాలర్లను సేకరించింది. 2017 నాటికి షియోమి ఆదాయం 114.62 బిలియన్ యువాన్లతో (18 బిలియన్ డాలర్లు) గా ఉంది. 2016లో ఇది 67.5 శాతం పెరిగింది. 2017లో ఆపరేటింగ్ లాభం 12.22 బిలియన్ యువాన్లుగా నమోదు చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Music,Video Apps Launched in India, Get Streaming Services and New Features
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot